- Telugu News Photo Gallery Technology photos Amazon great indian festival 2023 50 percentage discount on Xiaomi Redmi 12C features and price
Xiaomi Redmi 12C: రూ. 14 వేల స్మార్ట్‌ఫోన్, రూ. 7 వేలకే.. అదిరిపోయే డిస్కౌంట్..
పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ భారీ ఆఫర్లను అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Oct 30, 2023 | 10:51 AM

మంచి ఫీచర్లతో తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి అమెజాన్ సేల్‌లో సూపర్ డీల్ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 13,999గా ఉండగా, ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు. రూ. 315 ప్రారంభ ఈఎమ్‌ఐతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.71 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీస్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. షావోమీ 12సీలో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు పోర్ట్రేట్ మోడ్, నైట్ మోడ్ వంటి ఫీచర్లను అందించారు. ఇక సెల్ఫీల విషయానికొస్తే 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

షావోమీ 12 సీ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. లిథియం పాలీమర్ బ్యాటరీని ఇచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఫోన్ 39 గంటల ఫోన్ టాక్ టైమ్, 680 గంటల స్టాండ్ బై అందిస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఐపీ52 రేటింగ్‌ను అందించారు. గూగుల్ లెన్స్, రెయిర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అందించారు. ఈ ఫోన్ బరువు 192 గ్రాములుగా ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ వంటి ఫీచర్లను అందించారు.





























