Whatsapp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్‌.. గ్రూప్‌ కాలింగ్‌ పరిమితిపై..

వాట్సాప్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఫీచర్స్‌లో గ్రూప్‌ కాలింగ్‌ ఒకటి. ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు గాను ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి నాళ్లలో ఒకేసారి 7గురు మాట్లాడుకునేలా ఫీచర్‌ను తీసుకొచ్చారు. అనంతరం ఈ పరిమితిని 15కి పెంచుతూ నిర్ణయం తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరిమితిని మరోసారి పెంచుతూ వాట్సాప్‌ నిర్ణయం...

Whatsapp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్‌.. గ్రూప్‌ కాలింగ్‌ పరిమితిపై..
Whatsapp Group Call
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 31, 2023 | 12:30 PM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉంటుంది. మార్కెట్లోకి ఎన్నో మెసేజింగ్‌ యాప్స్‌ వస్తున్నా పోటీనీ తట్టుకునేలా వాట్సాప్‌ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

వాట్సాప్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఫీచర్స్‌లో గ్రూప్‌ కాలింగ్‌ ఒకటి. ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు గాను ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి నాళ్లలో ఒకేసారి 7గురు మాట్లాడుకునేలా ఫీచర్‌ను తీసుకొచ్చారు. అనంతరం ఈ పరిమితిని 15కి పెంచుతూ నిర్ణయం తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరిమితిని మరోసారి పెంచుతూ వాట్సాప్‌ నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా ఈ పరిమితిని 31 మందికి పెంచింది.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కేవలం ఐఓఎస్ యూజర్ల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్‌ మీట్‌, గూగుల్ మీట్‌ వంటి వాటికి పోటీగా ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఐఓఎస్‌ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్‌ సహాయంతో ఒకేసారి 31 మంది గ్రూప్‌ కాల్‌ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం యాపిల్‌ ఫోన్స్‌లోనే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇంతకీ ఫీచర్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

* గ్రూప్‌ కాల్‌ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు కాల్‌ చేయాలనుకుంటున్న గ్రూప్‌ చాట్‌ను ఓపెన్ చేయాలి.

* అనంతరం స్క్రీన్ పైభాగంలో ఉన్న వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ బటన్‌పై నొక్కాలి.

* అనంతరం గ్రూప్‌ కాల్ చేయాలనుకుంటున్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* ఒకవేళ గ్రూప్‌లో 31 మందికంటే ఎక్కువ ఉంటే మీరు మాట్లాడుకోవాలనకుంటున్న 31 మందిని ఎంచుకోవాలి.

* సభ్యులను ఎంచుకున్న తర్వాత వీడియో లేదా ఆడియో కాల్‌ బటన్‌పై నొక్కితే కాల్‌ని ప్రారంభించవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?