SIM Swapping Scam: మోసం గురూ! ‘స్వాప్.. స్కామ్’.. దీని గురించి తెలుసుకోకపోతే రూ. లక్షలు నష్టపోతారు!

ఇటీవల వెలుగుచూస్తున్న కొత్త తరహా మోసం గురించి తెలుసుకుంటే ఒళ్లు గగుర్పాటుకు గురికావడం ఖాయం. ఈ మోసంలో మీ ప్రమేయం ఏమీ ఉండదు. మీరు ఎటువంటి సమాచారం చెప్పకపోయినా, మీ పొరపాటు ఏమి లేకపోయినా నేరగాళ్లు మీ ఖాతాలోని డబ్బులు కొల్లగొట్టేస్తారు. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? ఈ కొత్త తరహా స్కామ్ పేరు సిమ్ స్వాపింగ్. దీని సాయంతోనే ఇటీల సైబరాసురులు ప్రజలపై పడుతున్నారు.

SIM Swapping Scam: మోసం గురూ! ‘స్వాప్.. స్కామ్’.. దీని గురించి తెలుసుకోకపోతే రూ. లక్షలు నష్టపోతారు!
Sim Swapping
Follow us

|

Updated on: Oct 31, 2023 | 1:12 PM

ఆన్ లైన్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు. అందివస్తున్న సాంకేతికతను సాధారణ ప్రజలు ఏమేరకు వినియోగించుకుంటున్నారో తెలియదుగానీ.. నేరస్తులు మాత్రం పూర్తి స్థాయిలో దానిని అందిపుచ్చుకొని సామాన్యులకు టోపీలు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఓటీపీల ద్వారానో లేక, ఫోన్ చేసి వివరాలు కొనుక్కోవడం ద్వారానో నేరగాళ్లు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టేవారు. ఏదైనా ఫిషింగ్ మెసేజ్ పంపడం, ప్రమాదకర లింకుల ద్వారా మన డబ్బులను కాజేసే వారు. అయితే ఇటీవల వెలుగుచూస్తున్న కొత్త తరహా మోసం గురించి తెలుసుకుంటే ఒళ్లు గగుర్పాటుకు గురికావడం ఖాయం. ఈ మోసంలో మీ ప్రమేయం ఏమీ ఉండదు. మీరు ఎటువంటి సమాచారం చెప్పకపోయినా, మీ పొరపాటు ఏమి లేకపోయినా నేరగాళ్లు మీ ఖాతాలోని డబ్బులు కొల్లగొట్టేస్తారు. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? ఈ కొత్త తరహా స్కామ్ పేరు సిమ్ స్వాపింగ్. దీని సాయంతోనే ఇటీల సైబరాసురులు ప్రజలపై పడుతున్నారు. అమెరికాలో తొలిసారి ఈ తరహా కేసులు వెలుగులోకి రాక.. ఇప్పుడు మన దేశంలోని ప్రధాన నగరాల్లోనూ వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ మహిళ ఇలానే రూ. 50లక్షలు పోగొట్టుకున్న ఘటన బయటపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీకి చెందిన న్యాయవాదికి చేదు అనుభవం..

ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ సిమ్ స్వాపింగ్ స్కామ్ తోనే రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. అది ఎలా అంటే.. ఆ మహిళకు తెలియని నంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్‌లు వచ్చాయి. ఆ తర్వాత ఆ సిమ్ పనిచేయలేదు. ఈ నంబర్ ఎవరిదా అని ఆ మహిళ వేరే నంబర్ నుంచి తిరిగి కాల్ చేయగా.. అవతలి వ్యక్తి.. మీకు కొరియర్ వచ్చిందని.. మీ అడ్రస్ దీనిపై మిస్ అయ్యిందని.. అడ్రస్ చెబితే కొరియర్ పంపిస్తామని చెప్పారు. ఆ వివరాలను ఆ మహిళ తెలిపింది. ఆ వెంటనే ఆ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి రెండు లావాదేవీలు జరిగినట్లు ఫోన్ కి మెసేజ్ వచ్చింది. అయితే ఆమె ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వంటి ఎలాంటి సమాచారాన్ని స్కామర్‌తో పంచుకోలేదు. అయితే ఇది సిమ్ స్వాపింగ్ ద్వారానే చేశారని ఢిల్లీ పోలీసు సైబర్ విభాగం తెలిపింది.

సిమ్ స్వాపింగ్ స్కామ్ అంటే ..

స్కామర్ మీ సిమ్ కార్డ్‌కి యాక్సెస్‌ని పొంది నిర్వహిస్తారు. వారు తమ వద్ద ఉన్న సిమ్ కార్డ్‌కి మీ నంబర్‌ను లింక్ చేసేలా నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను మోసగిస్తారు. ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ పై నియంత్రణ పొందుతారు. ఎవరైనా ఈ నంబర్‌కు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా స్కామర్‌ల పరికరానికి కనెక్ట్ అవుతారు. సిమ్ నంబర్ వారి చేతిలోకి వెళ్లి పోతుంది కాబట్టి టూ స్టెప్ అథంటికేషన్ చేయడానికి, లేదా ఓటీపీలు పొందడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఎలా స్వాప్ చేస్తారంటే..

స్కామర్లు స్టెప్ బై స్టెప్ విధానంలో మీ సిమ్ స్వాప్ చేస్తారు. మొదటి మీ సోషల్ మీడియా ప్లాట్ ఫారం నుంచే మీ ఆర్థిక స్థితిని, మీ సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకులు, బీమా కంపెనీల పేరుతో మీ జీమెయిల్ ఖాతాకు ఫిషింగ్ మెయిల్స్ పంపుతారు. వాటి ద్వారా మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, ఫోన్ నంబర్లు తెలుసుకుంటారు. మీ వివరాలన్నీ పొందుకున్న తర్వాత ఫోన్ పోయిందని, కొత్త సిమ్ కావాలని మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ను సంప్రదిస్తారు. సర్వీస్ ప్రొవైడర్ అడిగే ప్రశ్నలన్నింటికీ సరిగ్గా సమాధానం ఇస్తారు. ఎందుకంటే అప్పటికే మీ వ్యక్తిగత వివరాలన్నీ వారి వద్ద ఉంటాయి. దీంతో మొబైల్ కంపెనీలకు ఎలాంటి అనుమానం రాదు. కొత్త సిమ్ కార్డు అప్రూవ్ అవుతుంది. ఆ కార్డు ఇవ్వగానే మీరు ప్రస్తుతం వాడుతున్న పాత సిమ్ డీయాక్టివేట్ అయిపోతుంది. కొత్త సిమ్ కార్డు వారి చేతిలోనే ఉంటుంది కాబట్టి.. అది యాక్టివేట్ కాగానే అప్పటివరకు వివిధ మార్గాల ద్వారా సేకరించిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాలతో మనీ ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ షాపింగ్ చేసేస్తారు. సిమ్ కార్డు వారి వద్దే ఉంటుంది కాబట్టి.. ఓటీపీలు అదే నంబర్ కు వస్తాయి. దీంతో లావాదేవీలు సులువుగా జరిగిపోతాయి. బ్యాంకులకు అంతా సక్రమంగా జరిగినట్టే ఉంటుంది. కానీ వినియోగదారుడికి కుచ్చుటోపీ పడుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించండి..

  • మీకు అనుమానాస్పదంగా అనిపించే వ్యక్తితో ఎక్కువ సేపు మాట్లాడవద్దు.
  • మీ సిమ్ కార్డ్ లాక్ చేసి ఉన్నా.. లేదా అది ‘నో వ్యాలిడ్’ వంటి ఎర్రర్ మెసేజ్‌ని చూపినా.. వెంటనే మీ సర్వీస్ ప్రొవైడర్‌ని సంప్రదించి, ఆ నంబర్‌ని బ్లాక్ చేయండి.
  • మీరు సిమ్ లాక్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఇది మీ వివరాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  • దీన్ని అనుసరించి, మీ యూపీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను బ్లాక్ చేయండి.
  • క్రమం తప్పకుండా మీ పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండండి.
  • మీ ఖాతా వివరాలను తనిఖీ చేయండి.
  • ఏదైనా మోసపూరిత లావాదేవీలు జరిగితే.. మీరు వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి.
  • టూ స్టెప్ అథంటికేషన్ ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకొని ఉండాలి. ఇది మీ వివరాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..