Viral Video: ట్రాక్టర్ ముందు చక్రాలు గాల్లోకెత్తి విన్యాసం.. రెప్పపాటులో ప్రాణం తీసిన స్టంట్
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లా తాతే గ్రామానికి గ్రామానికి చెందిన సుఖ్‌మన్‌దీప్ సింగ్ (29) ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తుంటాడు. ఆయన భార్య పంజాబ్ పోలీసు శాఖలో పనిచేస్తోంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఫతేగఢ్ ఛురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో నిర్వహిస్తున్న రూరల్ క్రీడా పోటీల్లో సుఖ్‌మన్‌దీప్ కూడా పాల్గొన్నాడు. అక్కడ తాను నడుపుతోన్న ట్రాక్టర్‌తో రకరకాల విన్యాసాలు ప్రదర్శించాడు. దీనిలో భాగంగా ట్రాక్టర్ ముందు చక్రాలను గాల్లోకి లేపి కిందకి దిగాడు. అనంతరం ఆ వాహనం..
చండీగఢ్, అక్టోబర్ 30: పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలో నిర్వహించిన స్పోర్ట్స్ ఫెయిర్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. 29 ఏళ్ల సుఖ్‌మన్‌జీత్ సింగ్ అనే యువకుడు ట్రాక్టర్‌పై విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ముందు చక్రాలు పైకెత్తి వెనుక టైర్లను మట్టిలో వేసి ట్రాక్టర్ నడుస్తుండగానే కిందకు దిగాడు. దురదృష్టవశాత్తు, ట్రాక్టర్ అదుపుతప్పి జనం వైపు దూసుకెళ్లింది. అదుపు చేసేందుకు ప్రయత్నించగా స్టంట్ మాస్టర్ ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లా తాతే గ్రామానికి గ్రామానికి చెందిన సుఖ్‌మన్‌దీప్ సింగ్ (29) ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తుంటాడు. ఆయన భార్య పంజాబ్ పోలీసు శాఖలో పనిచేస్తోంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఫతేగఢ్ ఛురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో నిర్వహిస్తున్న రూరల్ క్రీడా పోటీల్లో సుఖ్‌మన్‌దీప్ కూడా పాల్గొన్నాడు. అక్కడ తాను నడుపుతోన్న ట్రాక్టర్‌తో రకరకాల విన్యాసాలు ప్రదర్శించాడు. దీనిలో భాగంగా ట్రాక్టర్ ముందు చక్రాలను గాల్లోకి లేపి కిందకి దిగాడు. అనంతరం ఆ వాహనం గుండ్రంగా గింగిరాలు తిరుగుతుండగానే టైరు మీద కాలుపెట్టి డ్రైవరు సీట్లోకి వెళ్లేందుకు సాహసించాడు. అలా పాదాలను టైర్‌పై పెట్టి ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించిన క్రమంలో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయాడు.
The Punjab Government should impose a ban on such activities at events. A young man, Sukhmanjeet Singh, aged 29, lost his life while performing stunts on a tractor. He raised the front wheels, pressed the rear tires into the soil, and got down from the tractor while it was… pic.twitter.com/w8DVAN1b3u
— Gagandeep Singh (@Gagan4344) October 29, 2023
వెంటనే చుట్టుపక్కల వారు అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ట్రాక్టర్ అదుపు చేయలేక అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్ అతడిపైకి పలుమార్లు వెళ్లింది. ఇంతలో ట్రాక్టర్ చక్రాల కింద నలిగి సుఖ్‌మన్‌దీప్ తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలపై నిషేధం విధించాలంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.