Kerala Blast: కేరళ పేలుళ్ల కీలక నిందితుడు దొరికాడు.. ఫేస్‌బుక్ లైవ్‌లో ఒప్పేసుకున్నాడు.. దుబాయ్‌కి వాడికి కనెక్షనేంటి?
డొమినిక్ ఫోన్‌లో ఐఈడీని పేల్చేందుకు ఉపయోగించే రిమోట్ కంట్రోల్ విజువల్స్‌ను పోలీసులు గుర్తించారు. డొమినిక్ మార్టిన్, కొడకరా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయే ముందు పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ లైవ్‌లో నేరాన్ని అంగీకరించాడు. వీడియోలో డొమినిక్ మాట్లాడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించే మార్గాలను మార్చమని క్రైస్తవ వర్గానికి అనేకసార్లు అభ్యర్థనలు ఉన్నప్పటికీ, వారు అలా చేయడానికి నిరాకరించారు. అందుకే సదస్సులో బాంబు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

కేరళలోని కొచ్చిలో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్ల కేసు దర్యాప్తుని వేగవంతం చేసిన ఏఎన్ఐ ప్రధాన నిందితుడైన డొమినిక్ మార్టిన్ ను అరెస్ట్ చేశారు. అంతేకాదు డొమినిక్ మార్టిన్ అసలు ఎవరు అనే విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు డొమినిక్ మార్టిన్‌కు దుబాయ్ కు మధ్య ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. డొమినిక్ మార్టిన్ చాలా ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నట్లు విచారణలో వెల్లడయింది. దుబాయ్‌లో ఎలక్ట్రిక్ మ్యాన్‌గా పని చేశాడు. డొమినిక్‌కి ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లను తయారు చేయడంలో పూర్తి పరిజ్ఞానం ఉంది. అయితే డొమినిక్ మార్టిన్ 2 నెలల క్రితమే భారతదేశానికి తిరిగి వచ్చాడు.
కేరళలో ఇంగ్లీష్ బోధిస్తున్న డొమినిక్ మార్టిన్
డొమినిక్ సుమారు 15 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం భారతదేశానికి తిరిగి వచ్చిన నిందితుడు డొమినిక్ మార్టిన్ ఇంగ్లీష్ ట్యూషన్ బోధిస్తున్నాడు. అయితే గత ఐదున్నర సంవత్సరాలుగా తమ్మన్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివాసరం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డొమినిక్‌కు భార్య, కుమార్తె , కుమారుడు ఉన్నారు. నిందితుడు డొమినిక్ మార్టిన్ భార్య, కుమార్తె ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉన్నారు. కుమారుడు బ్రిటన్‌లో చదువుతున్నాడు. కూతురు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
ఉదయం 5:30 గంటలకు స్కూటర్‌పై బయలుదేరిన డొమినిక్
పేలుడు జరిగిన రోజు అంటే ఆదివారం ఉదయం 5.30 గంటలకు మార్టిన్ స్కూటర్‌పై ఇంటి నుంచి బయలుదేరినట్లు సమాచారం అందింది. అని భార్య ఎక్కడికి అని అడిగితే సమాధానం చెప్పలేదు. కేరళ పోలీసులు అతని ఇంటి నుంచి అతని పాస్‌పోర్ట్, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మార్టిన్ భార్య, కుమార్తె, ఇంటి యజమానిని కూడా విచారించారు. అంతేకాకుండా కాల్ డిటైల్స్ రికార్డుల నుంచి డొమినిక్‌తో పరిచయం ఉన్న వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. దుబాయ్‌లో అతను ఎవరితో కాంటాక్ట్‌లో ఉన్నాడనే విషయంపై దర్యాప్తు ముమ్మరంగా చేశారు.
డొమినిక్ ఫోన్‌లో ఐఈడీని పేల్చేందుకు ఉపయోగించే రిమోట్ కంట్రోల్ విజువల్స్‌ను పోలీసులు గుర్తించారు.
డొమినిక్ మార్టిన్, కొడకరా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయే ముందు పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ లైవ్‌లో నేరాన్ని అంగీకరించాడు. వీడియోలో డొమినిక్ మాట్లాడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించే మార్గాలను మార్చమని క్రైస్తవ వర్గానికి అనేకసార్లు అభ్యర్థనలు ఉన్నప్పటికీ, వారు అలా చేయడానికి నిరాకరించారు. అందుకే సదస్సులో బాంబు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
IED నుండి బాంబులు తయారీ ఎలా ..!
పేలుడు కోసం డొమినిక్ మార్టిన్ ఐఇడి, పేలుడు పదార్థాలను ఎక్కడ నుండి పొందాడో ఇంకా వెల్లడించలేదని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. ఐఈడీతో బాంబుల తయారీని ఎక్కడ నేర్చుకున్నాడో తెలియాల్సి ఉందన్నారు. అంతేకాదు ఈ పేలుడు ఘటనలో మార్టిన్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తుని వేగవంతం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..