AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధ తల్లిని కిరాతకంగా భార్య, పిల్లలతో కలిసి కొట్టిన కొడుకు.. పైగా లాయర్ కూడా

ఈ ఘటన పంజాబ్‌లోని రోపర్‌లో చోటు చేసుకుంది. వృద్ధురాలి కొడుకు లాయర్. తన కుటుంబం తో కలిసి తల్లితో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం లాయర్ సోదరి అతని ఇంటికి వచ్చింది. అప్పుడు తన కూతురుతో తల్లి.. కొడుకు కోడలు చేసిన పనిని తన బాధను చెప్పుకుంది. కొడుకు, కోడలు, కుటుంబం అంతా కలిసి తనను కొట్టారని చెప్పింది. దీంతో కుమార్తె తల్లి గదిలో అమర్చిన సీసీటీవీని సులభంగా యాక్సెస్ చేసింది.

వృద్ధ తల్లిని కిరాతకంగా భార్య, పిల్లలతో కలిసి కొట్టిన కొడుకు.. పైగా లాయర్ కూడా
Shocking Video Viral
Surya Kala
|

Updated on: Oct 28, 2023 | 5:43 PM

Share

ఒక తల్లి వందమంది పిల్లల్ని ఎన్ని కష్టాలు వచ్చినా పెంచుతుంది. అదే వందమంది తనయులు ఒక్క తల్లిని పెంచలేరు ఈ విషయం పెద్దలు చెప్పినా.. నేటి కాలంలో తరచుగా ఈ విషయాన్నీ రుజువు చేస్తూ ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ కొడుకు తన తల్లిని దారుణంగా కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.  ఓ కొడుకు తన తల్లిని దారుణంగా కొట్టిన హృదయ విదారక సీసీటీవీ ఫుటేజీలు బయటికి రావడంతో చూసిన వారంతా నివ్వెరపోయారు. వృద్ధురాలైన తల్లిని తన భార్య, పిల్లతో కలిసి ఓ కొడుకు పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. ఓ ఎన్జీవో సహకారంతో వృద్ధురాలైన తన తల్లిని ఆమె కూతురు రక్షించింది.

సమాచారం ప్రకారం ఈ ఘటన పంజాబ్‌లోని రోపర్‌లో చోటు చేసుకుంది. వృద్ధురాలి కొడుకు లాయర్. తన కుటుంబం తో కలిసి తల్లితో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం లాయర్ సోదరి అతని ఇంటికి వచ్చింది. అప్పుడు తన కూతురుతో తల్లి.. కొడుకు కోడలు చేసిన పనిని తన బాధను చెప్పుకుంది. కొడుకు, కోడలు, కుటుంబం అంతా కలిసి తనను కొట్టారని చెప్పింది. దీంతో కుమార్తె తల్లి గదిలో అమర్చిన సీసీటీవీని సులభంగా యాక్సెస్ చేసింది.

అప్పటి నుంచి ఈ సీసీటీవీని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నది కూతురు. ఒక సారి తన తమ్ముడు తల్లిని ఏదో అడుగుతూ ఊహించని విధంగా కొట్టడం మొదలు పెట్టాడు. తల్లి అని కనికరం లేకుండా తల్లిని కొడుతూనే ఉన్నాడు. కొడుకు మాత్రమే కాకుండా కోడలు.. మనవరాళ్లు కలిసి తన తల్లిని కొట్టడం కనిపించింది. ఇదంతా ఆమె సోదరి రికార్డ్ చేసింది. తర్వాత సోదరి కొంత మంది బంధువులతో మాట్లాడింది.  సోదరుడు లాయర్ కావడంతో ఎవరూ ఏమీ చేయలేయమన్నారు. దీంతో ఆ మహిళ ఓ ఎన్జీవోను సంప్రదించింది.

ఇవి కూడా చదవండి

ఎన్జీవోతో కలిసి కూతురు తన తల్లిని రక్షించింది. వృద్ధురాలైన తల్లిని కుటుంబం మొత్తం ఎంత కిరాతకంగా కొడుతున్నారో సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. వృద్ధురాలి కుమార్తె ఎన్జీవోను సంప్రదించగా వారు వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో బయటపడిన తర్వాత స్థానికంగా పోలీసులు, అధికారులను సంప్రదించారు. అనంతరం బాధతురాలైన వృద్ధురాలిని తన సొంత కొడుకు కుటుంబం నుంచి రక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!