AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accidents: ప్రమాదాలకు టెక్నాలజీతో చెక్‌.. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో..

తాజాగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్ హైవేస్ శాఖ చేసిన సర్వేలో మితిమీరిన వేగంతో వెళ్లడమే ప్రమాదాలకు కారణంగా తెలిసింది. కొత్త వాహనాలు, కొత్త రోడ్లు దీంతో రైడర్స్ హై స్పీడ్‌తో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైన స్పీడ్ లిమిట్‌ను సూచించే బోర్డులు ఉన్నప్పటికీ కనీసం వాటిని చూసి ఆ స్పీడ్‌ను పాటించేవారు ఒక్కరు కనిపించరు. చాలా స్పీడ్ గన్స్ పెట్టినా, పెద్దగా ఫలితాలు రావడం లేదు. నెంబర్ ప్లేట్లు మార్చి..

Accidents: ప్రమాదాలకు టెక్నాలజీతో చెక్‌.. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో..
Artificial Intelligence
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Oct 29, 2023 | 11:11 AM

Share

భారత్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు. ప్రతి గంటకి 47 ప్రమాదాలు 18 మంది యాక్సిడెంట్స్‌లో మరణిస్తున్నారు. రోడ్ల ప్రమాణాలు పెరుగుతున్నాయి. నాణ్యతకు ఉన్న రోడ్లను , ఇప్పటి వాహనాలకు తగ్గట్లుగా రూపొందిస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి, తప్ప తగ్గడం లేదు. అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీని పెంచి, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

తాజాగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్ హైవేస్ శాఖ చేసిన సర్వేలో మితిమీరిన వేగంతో వెళ్లడమే ప్రమాదాలకు కారణంగా తెలిసింది. కొత్త వాహనాలు, కొత్త రోడ్లు.. దీంతో రైడర్స్ హై స్పీడ్‌తో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైన స్పీడ్ లిమిట్‌ను సూచించే బోర్డులు ఉన్నప్పటికీ కనీసం వాటిని చూసి ఆ స్పీడ్‌ను పాటించేవారు ఒక్కరు కనిపించరు. చాలా స్పీడ్ గన్స్ పెట్టినా, పెద్దగా ఫలితాలు రావడం లేదు. నెంబర్ ప్లేట్లు మార్చి.. స్పీడ్ గన్‌ను ఏమార్చి మరీ దూసుకెళ్తున్నారు కొంతమంది. అనేక పరిశోధనల తర్వాత కేంద్ర ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని నేషనల్ హైవేలపై ప్రవేశపెట్టనుంది.

ప్రతీ వాహనం ప్రభుత్వం సూచించిన స్పీడ్ లిమిట్‌లో వెళ్లాల్సిందే. వెళ్లకపోతే ముందుగా వచ్చే టోల్ ప్లాజాలో ఆపేస్తారు. స్పీడ్ లిమిట్ దాటి వేగంగా వెళ్తే ఆ టోల్ ప్లాజాలో గేట్ ఓపెన్ కాదు. అక్కడే వాహనం ఆపేసి… భారీగా ఫైన్ వేయడంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. అయితే ఇది కేవలం స్పీడ్ లిమిట్ కోసమే కాకుండా వాహనదారులకు టోల్ ఫీజు కూడా తగ్గించబోతున్నారు. ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరమే టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు హైదరాబాదులో మొదలై విజయవాడకు వెళుతున్నారు అనుకోండి, మొత్తం మూడు టోల్ ప్లాజాల్లో ఫీజు కడతారు. కానీ కేవలం నల్లగొండ వెళ్లే వాళ్ళు కూడా చౌటుప్పల్ వద్ద టోల్ ఫీజు కట్టాల్సిందే, ఇప్పుడు అలా కాకుండా హైదరాబాదు నుంచి విజయవాడ వరకు ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ ఫీజు కట్టే సదుపాయం అందుబాటులోకి రానుంది.

నేషనల్ హైవేలపై ప్రతి 25 కిలోమీటర్లకి ఒక సెన్సార్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే మనం రోడ్ల మీద చూస్తున్న స్పీడ్ చూపించే సెన్సార్ల లా ఇవి పనిచేస్తాయి. వాహనాలను స్కాన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా వెళుతున్న స్పీడుతో పాటు, నేషనల్‌ హైవే నుంచి వాహనం ఎక్కడ దిగిపోయింది అనేదాన్ని క్యాలిక్యులేట్ చేసి ఫీజును కట్ చేస్తాయి. తిరుపతి కొండ పైన ఎలాంటి నిబంధనలు ఉన్నాయో.. అలాంటివే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి.

కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంత టైం లిమిట్ ఉంది. తక్కువ టైంలో వస్తే… ఫైన్ వేస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్‌కి 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తే రెండు గంటల 45 నిమిషాలు పడుతుంది. ముందుగా మీరు వెళ్తే.. టోల్ ప్లాజాలో ఆపేసి ఫైన్ వేస్తారు కౌన్సెలింగ్ ఇస్తారు. నేషనల్ హైవేలపై ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ అమలోకి వస్తే 60 శాతానికి పైగా ప్రమాదాలు తగ్గిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!