AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి నీ ప్రేమ బంగారంకానూ..! లవర్‌ని పెళ్లి చేసుకోవడానికి.. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.25 లక్షల డిమాండ్.. ఎండ్ కార్డ్‌కు ముందే..!

షాడోల్‌లోని బుధార్ పట్టణంలో  ఒక వ్యక్తి తన మొబైల్‌లో అకస్మాత్తుగా వాట్సాప్ సందేశాన్ని చదివి కంగుతిన్నాడు. సాయంత్రానికి రూ.25 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును చంపేస్తానని మెసేజ్ లో స్పష్టంగా రాసి ఉంది. ఈ బెదిరింపు సందేశాన్ని చదివిన వెంటనే ఈ విషయాన్నీ తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే బాధితుడి తండ్రి తన తమ్ముడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఓరి నీ ప్రేమ బంగారంకానూ..! లవర్‌ని పెళ్లి చేసుకోవడానికి.. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.25 లక్షల డిమాండ్.. ఎండ్ కార్డ్‌కు ముందే..!
Madhya Pradesh
Surya Kala
|

Updated on: Oct 28, 2023 | 5:29 PM

Share

సినిమాల్లో , సీరియల్స్ లో తమ డబ్బుల అవసరాలను తీర్చుకోవడానికి ధనవంతులైన పిల్లల్ని కిడ్నప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడాన్ని ఒక యువకుడు బాగా ఫాలో అయ్యినట్లున్నాడు. ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి కటకటకాలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో ఈ నెల 25వ తేదీన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

షాడోల్‌లోని బుధార్ పట్టణంలో  ఒక వ్యక్తి తన మొబైల్‌లో అకస్మాత్తుగా వాట్సాప్ సందేశాన్ని చదివి కంగుతిన్నాడు. సాయంత్రానికి రూ.25 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును చంపేస్తానని మెసేజ్ లో స్పష్టంగా రాసి ఉంది. ఈ బెదిరింపు సందేశాన్ని చదివిన వెంటనే ఈ విషయాన్నీ తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే బాధితుడి తండ్రి తన తమ్ముడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న బుధార్ పోలీసులు రంగంలోకి దిగారు. మెసేజ్, మొబైల్ నంబర్ ఆధారంగా ఆరాతీసిన పోలీసులు వెంటనే 17 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నప్ లో యువకుడికి సాయం చేసిన మరికొందరికి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పంచవటి మొహల్లాకు చెందిన బాధితుడు మకరేంద్ర గుప్తా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తన మొబైల్‌కు వాట్సాప్ సందేశం వచ్చిందని తెలిపారు. ఈ మెసేజ్‌లో ‘నీ కొడుకు అథర్వుడిని చంపేస్తాను.. నీ కొడుకు నీ ప్రాణాలతో కావాలంటే.. రేపు సాయంత్రంలోగా రూ.20 లక్షలు మేము చెప్పిన చిరునామాకు పంపండి’ అని రాసి ఉంది. అంతేకాదు మర్నాడు అంటే అక్టోబర్ 26వ తేదీ  ఉదయం అథర్వుడి ని చంపేస్తామంటూ మనోజ్ గుప్తాకు అథర్వ మొబైల్ ఫోన్‌ నుంచి మరో మెసేజ్ ను పంపించాడు. ఈ మెసేజ్ లో తనకు రూ. 20 కాదు, 25 లక్షలు కావాలని ఇవ్వకపోతే నీ కొడుకులిద్దరినీ చంపేస్తామని పేర్కొన్నాడు.

తనను తక్కువగా అంచనా వేయవద్దని.. తన వెనుక చాలా మంది పెద్ద వ్యక్తులు ఉన్నారని కిడ్నాపర్  మెసేజ్‌లో చెప్పాడు. మీ ఇద్దరి కొడుకులు ప్రాణాలతో కావాలంటే.. తనను ఏమీ చెయ్యకూడదని హెచ్చరించాడు కూడా. సాయంత్రం వరకు 25 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ బెదిరింపుతో కూడిన మెసేజ్ చూసిన కుటుంబం మొత్తం భయాందోళనకు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు.

పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ వేసుకున్న కిడ్నపర్

నిందితుడికి గర్ల్‌ఫ్రెండ్ ఉందని.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే పెళ్లి చేసుకోవాలంటే తనకు ఒక కారు, ఇల్లు కావాలనుకున్నాడని.. అందుకనే వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేయాలనీ ప్లాన్ చేశాడు. కిడ్నాప్ చేసే పద్ధతిని మొబైల్ ద్వారా సెర్చ్ చేసి.. సినిమాలను చూసి కిడ్నప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో ఏఎస్పీ అంజులత పాట్లే మాట్లాడుతూ.. కేసును సీరియస్‌గా విచారిస్తున్నామని, అరెస్టు చేసిన నిందితుల విచారణ కొనసాగుతోందని, ఈ కుట్ర వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై