Sharath Purnima: ఈ రోజు శరత్ పూర్ణిమ.. గ్రహణ నీడలో విష్ణు లక్ష్మిదేవిని ఎలా పూజించాలో తెలుసా?

అర్ధరాత్రి 1:06 నుంచి గ్రహణం ప్రారంభమై  02:22 వరకు ఉంటుంది. ఈ సమయం సూతక కాలం 8 గంటల ముందు మొదలై.. అంటే ఈ రోజు సాయంత్రం 4. గంటలకు సూతకం మొదలై.. గ్రహణం ముగిసిన తర్వాత సూతక కాలం ముగుస్తుంది.  అటువంటి పరిస్థితిలో చంద్రుడికి పాయసం సమర్పించడం గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే సాధ్యం. గ్రహణానికి ముందు, మీరు పాయసం చేయాలనుకున్న పాలలో తులసి ఆకులను వేసి ఉంచండి.

Sharath Purnima: ఈ రోజు శరత్ పూర్ణిమ.. గ్రహణ నీడలో విష్ణు లక్ష్మిదేవిని ఎలా పూజించాలో తెలుసా?
Sharath Purnima
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2023 | 2:56 PM

ఈ రోజు ఆశ్వయుజ మాసం పౌర్ణమి. దీనిని హిందూ మతంలో ఆశ్వయుజ మాసంలోని పౌర్ణమిని శరత్ పున్నమి, కాముడి పున్నమి అని కూడా పిలుస్తారు. శరత్ పూర్ణిమ హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శరత్ పౌర్ణమి రోజున శ్రీ విష్ణువు, చంద్రుడు, లక్ష్మీదేవి,  శ్రీ కృష్ణుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషికి సకల సంతోషాలు కలుగుతాయని విశ్వసిస్తారు. శరత్ పూర్ణిమ రాత్రి, చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడని విశ్వాసం. అంతేకాదు చంద్రుడికి పూజ చేసి పాలు, పాయసం నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వలన అదృష్టం, ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. అయితే ఈ సంవత్సరం చంద్రగ్రహణం కూడా శరత్ పున్నమి రోజున ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో చంద్రుడిని ఎలా పూజించాలి, నైవేద్యాన్ని ఎలా సమర్పించాలి వివరంగా తెలుసుకుందాం..

గ్రహణం నీడలో పాయసం ఎప్పుడు సమర్పించాలంటే.. 

హిందూ విశ్వాసం ప్రకారం శరత్ పూర్ణిమ రోజున ఆరు బయట చంద్రుడి వెన్నెల కురిపిసున్న సమంయంలో పాయసం తయారు చేసి చంద్రునికి సమర్పించే సంప్రదాయం ఉంది. అయితే ఈ సంవత్సరం  28 వ తేదీ..  రాత్రి తెల్లవారితే 29వ తేదీ సమయంలో గ్రహణం ఏర్పడనుంది. అర్ధరాత్రి 1:06 నుంచి గ్రహణం ప్రారంభమై  02:22 వరకు ఉంటుంది. ఈ సమయం సూతక కాలం 8 గంటల ముందు మొదలై.. అంటే ఈ రోజు సాయంత్రం 4. గంటలకు సూతకం మొదలై.. గ్రహణం ముగిసిన తర్వాత సూతక కాలం ముగుస్తుంది.  అటువంటి పరిస్థితిలో చంద్రుడికి పాయసం సమర్పించడం గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే సాధ్యం. గ్రహణానికి ముందు, మీరు పాయసం చేయాలనుకున్న పాలలో తులసి ఆకులను వేసి ఉంచండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల చంద్రగ్రహణం దోషం ఉండదని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

శరద్ పూర్ణిమ రోజున చేయాల్సిన పరిహారాలు..

హిందూ మతంలో శరత్ పూర్ణిమ రోజున శ్రీ విష్ణువు పసుపు పువ్వులు, లక్ష్మీ దేవిని ఎర్రటి పువ్వులతో పూజించాలి. హిందువుల విశ్వాసం ప్రకారం, శరత్ పూర్ణిమను పూజించేటప్పుడు కథ చదివి శ్రీ విష్ణు లక్ష్మి లకు ఆరతి తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి నెయ్యి  దీపం పెట్టాలి. లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆమె ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయని నమ్ముతారు.

శరత్ పూర్ణిమ పూజ నియమాలు

హిందూ విశ్వాసం ప్రకారం శరత్ పూర్ణిమ రోజున ఎవరైనా సరే పొరపాటున కొన్ని పనులను చేయకూడదు.  లేకపోతే సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి కోపం తెచ్చుకుని వెళ్లిపోతుంది. శరత్ పూర్ణిమ రోజున మద్యం, మాసం వంటి ఆహారాన్ని తినరాదు. డబ్బు లావాదేవీలకు, విబేధాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఈ రోజున పొరపాటున కూడా నల్లని దుస్తులు ధరించకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.