Dhanteres 2023: ధన్ తేరస్ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..

ధన్ తేరాస్ రోజున లక్ష్మీ దేవి, గణేశుడు, కుబేరునికి సంబంధించిన వస్తువులను కొనడం చాలా శుభ ప్రదమైందిగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం సరైనది కాదు. కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన దుఃఖాన్ని కష్టాలను కొనుగోలు చేయడమే అని చెబుతున్నారు. ఈ రోజు ధన్ తేరాస్ రోజున పొరపాటున కూడా కొనుగోలు చేయకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.. 

Dhanteres 2023: ధన్ తేరస్ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..
Dhanteres 2023
Follow us

|

Updated on: Oct 26, 2023 | 7:22 PM

హిందూ మతంలో పండగలు, పర్వదినాలు అనేకం.. వినాయక చవితి, దసరా, సంక్రాంతి, ఉగాది వంటి అనేక ప్రధాన పండగలను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరా నవరాత్రుల సందడి పూర్తి అయింది. ఇప్పుడు దీపావళి వెలుగులను తెచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ ఏడాది నరక చతుర్దశిని నవంబర్ 11వ తేదీన దీపావళిని 12 వ తేదీన జరుపుకోనున్నాము. అయితే దీపావళికి 2 రోజుల ముందు ధన్ తేరాస్ గా జరుపుకుంటారు.  ఈ సంవత్సరం నవంబర్ 10న ధన్తేరస్ వచ్చింది. వాస్తవానికి దీపావళి పండుగను కొన్ని ప్రాంతాల వారు ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఐదు రోజుల దీపావళి పండగ ధన్తేరస్ నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున లక్ష్మీ-కుబేరులను పూజించే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఉంది. ధన్తేరస్ రోజున తమ జీవితంలో సుఖ సంతోషాలను, ఆనందాన్ని తీసుకురావడానికి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ధన్ తేరాస్ రోజున లక్ష్మీ దేవి, గణేశుడు, కుబేరునికి సంబంధించిన వస్తువులను కొనడం చాలా శుభ ప్రదమైందిగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం సరైనది కాదు. కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన దుఃఖాన్ని కష్టాలను కొనుగోలు చేయడమే అని చెబుతున్నారు. ఈ రోజు ధన్ తేరాస్ రోజున పొరపాటున కూడా కొనుగోలు చేయకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

ఇనుప వస్తువులు:

ధన్ తేరాస్ రోజు పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనకండి. ఇలా చేయడంతో సంపదకు అధిదేవత  లక్ష్మిదేవికి కోపం వస్తుందని విశ్వాసం. కనుక ఈ రోజున ఇనుప పాత్రలు పొరపాటున కూడా కొనుగోలు చేయవద్దు.

ఇవి కూడా చదవండి

గాజు వస్తువులు

ధన్‌తేరస్‌ రోజున గాజుతో చేసిన వస్తువులను కొనకండి. గాజు.. రాహువు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల గాజు వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడదు.

కత్తెర వంటి పదునైన వస్తువులు

ధన్‌తేరస్ రోజున కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను కొనడం శ్రేయస్కరం కాదు. పదునైన వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి. అంతేకాదు పదునైన వస్తువులు కొనడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

నలుపు వస్తువులు

ధన్‌తేరస్ రోజున నలుపు రంగు వస్తువులను పొరపాటున కూడా కొనుగోలు చేయవద్దు. హిందూ మతంలో నలుపు రంగు చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ధన్‌తేరస్‌లో నలుపు రంగు వస్తువులను కొనకూడదు. అంతేకాదు ధన్ తేరస్ రోజున నలుపు రంగు దుస్తులు ధరించవద్దు.

నూనె, నెయ్యి కొనకూడదు

ధన్‌తేరస్ రోజున నూనె, నెయ్యి సహా ఆయిల్ తో చేసిన శుద్ధి చేసిన ఉత్పత్తులను ఎప్పుడూ కొనకండి. ధన్‌తేరస్‌లో పవిత్రమైన రోజున ఇళ్లలో దీపాలను వెలిగిస్తారు. అటువంటి పరిస్థితిలో ధన్‌తేరస్‌కి ఒక రోజు ముందు నూనె కొనండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.