Lunar Eclipse: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ నెల 28న దర్శనాలు రద్దు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవారి ఆలయ తలుపులు ఈ నెల 28వ తేదీ రాత్రి 7 గంటలకు మూసివేసి మర్నాడు అంటే 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. 29న తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది.
అక్టోబర్ 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా గ్రహణం సమయానికంటే 8 గంటల ముందు నుంచి సూతకాలంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని దర్శనాలను అక్టోబర్ 28న రాత్రి 7.05 గంటలనుంచి నిలివేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవారి ఆలయ తలుపులు ఈ నెల 28వ తేదీ రాత్రి 7 గంటలకు మూసివేసి మర్నాడు అంటే 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. 29న తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. అదేవిధంగా అక్టోబర్ 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. భక్తులకు ఈ మేరకు భక్తులు అసౌకర్యానికి గురికాకుండా తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించు కోవాలని టిటిడి కోరుతోంది.
ఆలయాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్..
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబరు 28న టీటీడీ స్థానిక ఆలయాల మూత పడనున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 28న సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి అక్టోబరు 29న తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో అక్టోబరు 28న రాత్రి 7 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
శ్రీశైలం మల్లన్న ఆలయం ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు అనగా 29 న ఉదయం 5 వరకు ఆలయద్వారాలను మూసివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో పెద్దిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. 29 ఉదయం 5 గంటలకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి. సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం 7 గంటల నుండి భక్తులను దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జితసేవలు అనుమతిస్తామన్నారు.
చంద్రగ్రహణం రోజైన 28న మధ్యాహ్నం 3,30ల వరకు మాత్రమే భక్తులకు సర్వదర్శనం అనుమతిస్తామని అలానే 28 న మధ్యాహ్నం 12.30 వరకు మాత్రమే గర్భాలయ ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పిస్తూ సామూహిక అభిషేకాలు,స్పర్శ దర్శనాలు (సర్వ కాదు)కూడా ఉదయం మాత్రమే ఉంటుందని చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..