Home Decor Tips: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలనుకుంటున్నారా.. ఈ స్పెషల్ టిప్స్ మీకోసమే!

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే సంతోషం వెల్లివిరుస్తుంది. చిరునవ్వులతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్టీ ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదు. పాజిటివ్ ఎనర్జీ ఉంటే అన్ని విజయాలూ సిద్ధిస్తాయి. అన్ని పనులూ సక్రమంగా, సరైన సమయంలో పూర్తి అవుతాయి. శ్రేయస్సు పెరుగుతుంది. అదే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోతే.. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, తగాదాలు, మానసిక ప్రశాంత, గొడవలు, పేదరికం ఒక్కటేంటి..

Home Decor Tips: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలనుకుంటున్నారా.. ఈ స్పెషల్ టిప్స్ మీకోసమే!
1
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 10:30 PM

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే సంతోషం వెల్లివిరుస్తుంది. చిరునవ్వులతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్టీ ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదు. పాజిటివ్ ఎనర్జీ ఉంటే అన్ని విజయాలూ సిద్ధిస్తాయి. అన్ని పనులూ సక్రమంగా, సరైన సమయంలో పూర్తి అవుతాయి. శ్రేయస్సు పెరుగుతుంది. అదే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోతే.. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, తగాదాలు, మానసిక ప్రశాంత, గొడవలు, పేదరికం ఒక్కటేంటి.. ఎన్నింటినో ఎదుర్కొనాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలనుకునే వారు ఈ టిప్స్ ని ఖచ్చితంగా పాటించండి.

దేవుడి గది:

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ముఖ్యంగా ఆ ఇంట్లో దేవుడి గది అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే దేవుడిని ప్రార్థించే స్థలం ఈశాన్య దిక్కులో ఉంచేలా చూసుకోండి. అలాగే దేవుడిని ప్రార్థించేటప్పుడు పూర్వాభిముఖంగా కూర్చొని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వంట గది:

ఇంట్లో వంటగది ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్ ఉత్తరం లేదా ఈశాన్యంలో లేకపోతే.. ఆర్థిక, ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే వంట గదిని వీలైనంత వరకూ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడండి.

బెడ్ రూమ్:

వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్ అనేది ఎప్పుడూ నైరుతి దిక్కులో ఉండేలా చూసుకోవాలి. అలాగే దక్షిణం లేదా పడమర వైపు తల పెట్టి నిద్రించాలి. ఇలా చేస్తే దంపతలు మధ్య సంబంధం అనేది బలపడుతుంది. వీరి మధ్య తగాదాలు రాకుండా ఉంటాయి. భార్య ఎప్పుడూ భర్తకి ఎడమ వైపు మాత్రమే నిద్రించాలి.

టాయిలెట్స్:

కష్టాలను, అనారోగ్య సమస్యల్ని తెచ్చి పెట్టే టాయిలెట్స్ అనేవి ఇంటికి బయట ఉండేలా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇవి పడమర లేదా దక్షిణం వైపు ఉండాలి. లేకుంటే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, విద్యా సమస్యలు వస్తాయి.

ఎరుపు, ఊదా రంగులు వద్దు:

ఇంటిని అలంకరించడానికి ముదురు రంగై ఎరుపు, ఊదా రంగులను ఉపయోగించ కూడదు. ఇవి మీలో అనారోగ్య సమస్యల్ని పెంచుతుంది. అలాగే మీ బెడ్ రూమ్ లో నీటి చిత్రాలు, ఫౌంటైన్ల ఫొటోలను ఉంచకూడదు. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు వాస్తు శాస్త్ర నిపుణులను సంప్రదించడం మేలు