మంచి జాబ్ వదిలి భైరవి ఆలయంలో పూజారిగా మారిన లెబనాన్‌కు చెందిన క్రైస్తవ మహిళ.. ఆధ్యాత్మిక ప్రయాణం
కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలోని మా లింగ భైరవి ఆలయంలో భైరాగిణి మా హనీనే పూజారి. ఒక యువతి తన అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని, సౌకర్యాలను వదిలి వేరే సంస్కృతిని స్వీకరించడానికి.. తన జీవితమంతా ఆధ్యాత్మికతకు అంకితం చేయడానికి ప్రేరేపించింది? భైరాగిణి మా హనీనే హృదయాన్ని కదిలించే ప్రయాణం గురించి తెలుసుకుందాం..!
కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో ఓ మహిళ ఎరుపు రంగు చీరను ధరించి, భక్తులను వెచ్చని చిరునవ్వుతో పలకరిస్తూ, అత్యంత భక్తితో అమ్మవారిని ఆరాధింస్తుంది. ఆమె భైరాగిణి మా హనీనే. ఈ ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్క హిందువుకి ఆమె సుపరిచితమే.. అయినప్పటికీ ఆమె ముఖం విదేశీ పోలికలను కలిగి ఉంటుంది. ఓ విదేశీ వనిత భారత దేశంలో అడుగు పెట్టి.. ఓ ఆలయంలో పూజారిగా మారడం వెనుక హృదయాన్ని కదిలించే ఆమె ఆధ్యాత్మికత ప్రయాణం గురించి తెలుసుకుందాం..
ఆ మహిళ క్రిస్టియన్, విదేశీయురాలు అయితే అన్నింటికంటే మించి ఆమె తమిళనాడులోని లింగ భైరవి ఆలయంలో దేవతకు సేవ చేస్తున్న పూజారి. టైమ్స్ నౌతో ఆమె తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. లెబనాన్‌లోని క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ నుంచి భారత దేశంలోని ఒక దేవాలయంలో పూజారి వరకు తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఆధ్యాత్మికత మార్గంలో నడవడానికి.. అంతర్గత పరిపూర్ణతను సాధించడానికి ఆమె తన విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని, తన కుటుంబాన్ని విడిచి హిందూ ఆలయానికి పూజారిణిగా విధులను నిర్వహిస్తుంది.
లెబనాన్ కి చెందిన భైరాగిణి మా హనీనే గ్రాఫిక్ డిజైనింగ్ చదివి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసేది. అప్పుడు 2009లో ఫుల్‌టైమ్ వాలంటీర్‌గా భారత దేశానికి వచ్చింది. ఇప్పటికి భైరాగిణి మా హనీనే భారతదేశానికి వచ్చి 14 సంవత్సరాలు అయింది. అయినా తనకు నిన్న మొన్న అయినట్లు ఉందని చెబుతుంది.
తన మనసులో అనేక ప్రశ్నలు కలిగాయని.. ఆ సమాధానాలు వెదకడం కోసం సద్గురుని ఆశ్రయించినట్లు వెల్లడించింది. ఈశా యోగా సెంటర్ లో తనకు సమాధానాలు తెలిశాయని.. 2005లో తిరిగి ఇంటికి వెళ్లి ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి.. తన బ్యాగ్‌లు సర్దుకుని ఇక్కడికి వచ్చానని వెల్లడించింది. ఇక్కడ వచ్చిన తర్వాత తాను స్వచ్ఛందంగా సేవ చేయడం ప్రారంభించానని.. ఇప్పుడు తనకు ఇంతకు ముందెన్నడూ లేని సంతృప్తి దొరికిందని పేర్కొంది. సంవత్సరాల క్రితం సద్గురు తనను భైరాగిణి మా చేశారని వెల్లడించింది.
భైరాగిణి మా ఎవరంటే
భైరాగిణి మా అనేది లింగ భైరవి దేవి ఆలయంలోని పూజారులకు సంబంధించిన పదం. “భైరాగిణి” అనే పదానికి దేవి రంగు అని అర్థం. “అందుకే మేము ఎరుపు రంగును ధరిస్తాము,” ఆమె చిరునవ్వుతో చెప్పింది, “ఎరుపు రంగు జీవితం, ఉత్సాహం, తీవ్రతకు అర్ధం.
భైరాగిణి మా లింగ భైరవి నివాసానికి సంరక్షకులు. ఇక్కడ వీరు ప్రార్థనలు చేయడం నుండి హారతి వరకు అన్ని ఆచారాలను నిర్వహిస్తారు. పరాయి దేశం నుండి వచ్చిన ఒక మహిళ ఇంత పరిపూర్ణంగా.. భక్తి శ్రద్దలతో ఈ కర్మలన్నీ చేయడం చాలా మంది భక్తులకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
భారతీయులు ఎవరినైనా ఆనందంగా స్వీకరిస్తారు. అందుకనే తాను ఇప్పటికీ “నేను క్రిస్టియన్‌ని, మతం మారలేదు. నన్ను ఎవరూ మతం మారమని అడగలేదు” అని ఆమె చెప్పింది. తన కుటుంబం గురించి మాట్లాడుతూ, భైరాగిణి మ హానీనే తనకు పెద్ద మద్దతుగా నిలిచారని, తాను వారిని విడిచిపెట్టలేదని చెప్పింది. ప్రతిదానికీ ప్రతిస్పందించే, కోపంగా, చిరాకుపడే అమ్మాయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా.. ఓపికగా ఉండే తన కూతురుని వారు చూశారు. ఇప్పుడు వారు భారతదేశంలోని తమ కూతురు జీవితం గురించి ప్రజలకు చెబుతారు. అంతేకాదు కూతురు చేస్తున్న పనిని గురించి ఇప్పుడు గర్వపడుతున్నారు.”
భైరాగిణి మా హనీనే తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో వెల్లియంగిరి పర్వతాల దిగువన ఉన్న మా లింగ భైరవి ఆలయంలో పూజారి. ఈ ఆలయాన్ని వేరుగా ఉంచేది దాని విలక్షణమైన సంప్రదాయం.. “భైరాగిణి మా” అని పిలువబడే మహిళా పూజారులు మాత్రమే లోపలి గర్భగుడిలోకి ప్రవేశించి, దేవతను ఆరాధించడానికి అనుమతించబడతారు. లింగ భైరవిని ప్రాణ ప్రతిష్ఠ ద్వారా సద్గురు ప్రతిష్టించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..