Apple Jam: యాపిల్ జామ్ ని ఇలా ఇంట్లో హెల్దీగా సింపుల్ గా తాయరు చేయండి!

యాపిల్ జామ్ గురించి అందరికీ తెలుసు. ఈ యాపిల్ జామ్ ని పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రెడ్, చపాతీ, పూరీ వంటి వాటితో యాపిల్ జామ్ తింటే చాలా బావుంటుంది. సాధారణంగా ఈ యాపిల్ జామ్ ను బయట నుంచి కొని తీసుకొస్తారు. వీటిల్లో ఫుడ్ కలర్, అలాగే నిల్వ ఉండడానికి కొన్ని రకాల కెమికల్స్ అనేవి కలుపుతూ ఉంటారు. కానీ అదే ఇంట్లోనే చేసి.. పిల్లలకు పెడితే ఎంతో హెల్దీగా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఈ యాపిల్ జామ్ ను చేసుకోవచ్చు. మరి యాపిల్ జామ్ కి కావాల్సిన..

Apple Jam: యాపిల్ జామ్ ని ఇలా ఇంట్లో హెల్దీగా సింపుల్ గా తాయరు చేయండి!
Apple Jam
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 9:35 PM

యాపిల్ జామ్ గురించి అందరికీ తెలుసు. ఈ యాపిల్ జామ్ ని పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రెడ్, చపాతీ, పూరీ వంటి వాటితో యాపిల్ జామ్ తింటే చాలా బావుంటుంది. సాధారణంగా ఈ యాపిల్ జామ్ ను బయట నుంచి కొని తీసుకొస్తారు. వీటిల్లో ఫుడ్ కలర్, అలాగే నిల్వ ఉండడానికి కొన్ని రకాల కెమికల్స్ అనేవి కలుపుతూ ఉంటారు. ఇలా తయారు చేసినవి పిల్లలకు పెట్టడం  వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదే ఇంట్లోనే చేసి.. పిల్లలకు పెడితే ఎంతో హెల్దీగా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు, ఖాళీ ఈ యాపిల్ జామ్ ను సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి యాపిల్ జామ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ జామ్ కు కావాల్సిన పదార్థాలు:

యాపిల్స్, బీట్ రూట్, షుగర్, ఉప్పు, నిమ్మ రసం.

ఇవి కూడా చదవండి

యాపిల్ జామ్ తయారీ విధానం:

యాపిల్ జామ్ తయారు చేయడానికి ముందు యాపిల్ తొక్కలను తీసేసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిల్లో ఉండే గింజలను తీసేయాలి. తర్వాత ఈ యాపిల్ ముక్కలను ఆవిరి మీద 10 నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ నెక్ట్స్ ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి.. పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని స్ట్రెయినర్ లో వేసి వడకట్టాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్ వస్తుంది.

తర్వాత ఈ పేస్ట్ ను కడాయిలో వేసి అందులో పంచదార వేసి మీడియం మంట పై ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి.. ఈ మధ్యస్థ మంటపై గరిటతో కలుపుతూ ఉండాలి. ఇలా ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ఉడికించు కోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కలపాలి. ఇది జామ్ లా దగ్గర పడేంత వరకూ కలుపుతూ ఉడికించుకోవాలి.

ఇది చిక్కబడిన తర్వాత నిమ్మ రసం వేసి కలపాలి. దీన్ని మరో మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా, హెల్దీగా ఉండే యాపిల్ జామ్ సిద్ధం. దీన్ని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇంట్లోనే యాపిల్ జామ్ ని రెడీ చేయడం వల్ల శుభ్రంగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒక సారి ఈ యాపిల్ జామ్ ని చేసుకోండి.