Cleaning Tips: వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా వాసన పోవడం లేదా? ఈజీగా ఇలా చేయండి!

వాటర్ బాటిల్స్ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువ అయింది. వీటిల్లో ఇప్పుడు అనేక రకాలైన మోడల్స్ వస్తున్నాయి. స్టీల్స్, ప్లాస్టిక్స్ లో అయితే ఇక చెప్పాన్సిన అవసరం లేదు.. ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ లో ఎన్ని మోడల్స్ ఉన్నా.. రాగి, స్టీల్స్ బాటిల్సే మంచిది. ఇంట్లో అయినా.. మనం బయటకు వెళ్లాలన్నా.. బాటిల్స్ ని ఎక్కువగా వాడతారు. అయితే వీటిని రోజూ నార్మల్ గా కడిగి వాడుతూ ఉంటారు. కానీ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది. దీంతో చాలా..

Cleaning Tips: వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా వాసన పోవడం లేదా? ఈజీగా ఇలా చేయండి!
Water Bottle
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 10:45 PM

వాటర్ బాటిల్స్ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువ అయింది. వీటిల్లో ఇప్పుడు అనేక రకాలైన మోడల్స్ వస్తున్నాయి. స్టీల్స్, ప్లాస్టిక్స్ లో అయితే ఇక చెప్పాన్సిన అవసరం లేదు.. ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ లో ఎన్ని మోడల్స్ ఉన్నా.. రాగి, స్టీల్స్ బాటిల్సే మంచిది. ఇంట్లో అయినా.. మనం బయటకు వెళ్లాలన్నా.. బాటిల్స్ ని ఎక్కువగా వాడతారు. అయితే వీటిని రోజూ నార్మల్ గా కడిగి వాడుతూ ఉంటారు. కానీ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది. దీంతో చాలా మంది వీటిని వాడటం మానేసి.. కొత్తవి కొంటూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో చేస్తే వాటర్ బాటిల్స్ నీటిగా క్లీన్ అవ్వడమే కాకుండా.. వాసన కూడా పోతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకోండి.

టీ డికాషన్:

బాటిల్స్ లోని వాసనే కాదు గిన్నెల్లో వాసన పోగొట్టాలన్నా.. టీ, కాఫీ పౌడర్లు బాగా హెల్ప్ అవుతాయి. టీ డికాషన్ కాచి.. చల్లారాక వాటర్ బాటిల్స్ లో వేసి బాగా షేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాటిల్స్ లోని స్మెల్ ని దూరం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నిమ్మ కాయ:

నిమ్మ కాయతో కూడా చెడు వాసనను దూరం చేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మ రసం తీసుకుని వాటర్ లో అయినా కలపవచ్చు. లేదా వాటర్ బాటిల్ లో అయినా వేసి షేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు వాసన పోవడమే కాకుండా.. బ్యాక్టీరియా వంటివి ఏమైనా ఉన్నా పోతాయి. కేవలం వాటర్ బాటిల్సే కాకుండా.. మురికిగా, జిడ్డుగా, వాసన వచ్చే పాత్రలను కూడా నిమ్మ రసంతో క్లీన్ చేసుకోవచ్చు.

బేకింగ్ పౌడర్:

బేకింగ్ పౌడర్ తో కూడా వాటర్ బాటిల్స్ ను శుభ్ర పరచుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడాని తీసుకుని.. దాన్ని బాటిల్ లో వేసి.. వాటర్ ని పూర్తిగా నింపి ఒక రోజు వరకూ అలానే వదిలేసేయండి. ఆ తర్వాత రోజు క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాసన పోవడమే కాకుండా.. తెల్లగా వస్తాయి.

వాటర్ ఇలా తాగాలి:

చాలా మంది నీటిని తాగేటప్పుడు నోటికి దగ్గరగా పెట్టి తాగుతారు. ఇలా తాగితే బాటిల్ వాసన వస్తుంది. తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా వంటివి చేరతాయి. కాబట్టి నీరు తాగేటప్పుడు నోటికి దూరంగా పెట్టి తాగడం బెటర్.

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!