AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lice Problems: పేల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. వీటితో చెక్ పెట్టండి!

చిన్న పిల్లల నుంచి ముసలి వారిలో కూడా పేలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అస్తమనూ దురద, చికాకుగా అనిపిస్తుంది. ఈ పేలు రక్తాన్ని తాగి బతుకుతాయి కాబట్టి.. ఏకాగ్రత లోపిస్తుంది. తలలో ఒక్క పేను చేరిందంటే చాలు.. సులువుగా వాటి సంఖ్య పెరిగిపోతుంది. వీటిని తొందరగా వదిలించుకోవడం కూడా చాలా కష్టం. పేల వల్ల జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా జుట్టు అపరిశుభ్రంగా ఉంటేనే ఈ పేలు పడుతూ ఉంటాయి. అందుకే జుట్టును ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోవాలి. తలకు నూనె రాసుకున్న ఒకటి..

Lice Problems: పేల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. వీటితో చెక్ పెట్టండి!
Hair
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 26, 2023 | 10:25 PM

Share

చిన్న పిల్లల నుంచి ముసలి వారిలో కూడా పేలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అస్తమనూ దురద, చికాకుగా అనిపిస్తుంది. ఈ పేలు రక్తాన్ని తాగి బతుకుతాయి కాబట్టి.. ఏకాగ్రత లోపిస్తుంది. తలలో ఒక్క పేను చేరిందంటే చాలు.. సులువుగా వాటి సంఖ్య పెరిగిపోతుంది. వీటిని తొందరగా వదిలించుకోవడం కూడా చాలా కష్టం. పేల వల్ల జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా జుట్టు అపరిశుభ్రంగా ఉంటేనే ఈ పేలు పడుతూ ఉంటాయి. అందుకే జుట్టును ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోవాలి. తలకు నూనె రాసుకున్న ఒకటి, రెండు రోజుల్లోనే జుట్టును శుభ్ర పరుచుకోండి. అలాగే బయటకు వెళ్లి వచ్చినప్పడు తలపై దుమ్మూ, ధూళి చేరతాయి. అప్పుడు కూడా పేలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తల స్నానం చేస్తే చాలా మంచింది. ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల వీటిని దూరం చేసుకోవచ్చు.

తలస్నానం చేయాలి:

తల మురికిగా ఉంటేనే పేలు పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తలను వీలైనంత వరకూ క్లీన్ గా ఉంచుకోండి. అలాగే వారానికి రెండు సార్లు ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి.

ఇవి కూడా చదవండి

పెరుగు – నిమ్మ రసం:

పేలు తలలో చేరాయంటే రక్తాన్ని బాగా పీల్చేస్తాయి. అందుకే పేలు ఉన్న వారు రక్త హీనత సమస్యతో బాధ పడతారు. వీలైనంత త్వరగా ఈ పేలను దూరం చేసుకోవాలి. వీటికి చెక్ పెట్టడంలో పెరుగు – నిమ్మ రసం బాగా హెల్ప్ అవుతాయి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మాడుకు పట్టించి తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

వేపాకు – తులసి ఆకులు:

పేలను వదిలించుకోవడంలో వేపాకు – తులసి ఆకులు కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఈ రెండింటిని సమపాలల్లో తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ కి కొద్దిగా పసుపు, కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని తల కుదుళ్లకు బాగా పట్టించాలి. ఇది బాగా ఆరిపోయాక తల స్నానం చేస్తే.. ఈ వాసనకు పేలు బయటకు పోతాయి.

కొబ్బరి నూనె – సోంపు:

పేలను వదిలించుకోవడంలో ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా సోంపు కలిపి తలకు రాయాలి. ఆ తర్వాత తల స్నానం చేస్తే పేలు రాలిపోతాయి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాతో కూడా పేలను దూరం చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ లో బేకింగ్ సోడాను కలిపి తలకు పట్టిస్తే.. ఆ వాసకు పేలు చచ్చిపోతాయి. ఆ తర్వాత తల స్నానం చేస్తే.. బయటకు పోతాయి.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు