Knee Pain Relief Tips: ఇంట్లోనే వేసే ఈ యోగాసనాలతో మోకాళ్ల నొప్పులకు బైబై చెప్పేసేయండి!

ఇంట్లో పెద్దవారు ఉన్నారంటే ఖచ్చితంగా మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ ఉంటారు. అయితే అది ఒకప్పుడు.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పాతికేళ్లు దాటిన వారు కూడా ఈ మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ ఉన్నారు. మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు తొందరగా ఏ పనీ చేయలేరు. లేవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఒకరిపై ఆధార పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మారిన వాతావరణ మార్పులు, కలుషిత ఆహారం, నీరు కారణంగా మోకాళ్ల నొప్పులు..

Knee Pain Relief Tips: ఇంట్లోనే వేసే ఈ యోగాసనాలతో మోకాళ్ల నొప్పులకు బైబై చెప్పేసేయండి!
Knee Pain
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 10:40 PM

ఇంట్లో పెద్దవారు ఉన్నారంటే ఖచ్చితంగా మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ ఉంటారు. అయితే అది ఒకప్పుడు.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పాతికేళ్లు దాటిన వారు కూడా ఈ మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ ఉన్నారు. మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారు తొందరగా ఏ పనీ చేయలేరు. లేవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఒకరిపై ఆధార పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మారిన వాతావరణ మార్పులు, కలుషిత ఆహారం, నీరు కారణంగా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. అంతే కాకుండా కదల కుండా కూర్చోవడం వల్ల కూడా ఈ నొప్పులతో బాధ పడుతున్నారు. నడవాలన్నా.. లేవాలన్నా.. పరిగెత్తాలన్నా.. కూర్చోవాలన్నా మోకాళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇలా మీరు కూడా మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం.. ఈ యోగాసనాలు బాగా ఉపయోగ పడతాయి. మరి ఆ ఆసనాలు ఏంటి? వాటితో ఎలాంటి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

వీర భద్రాసనం:

ఈ ఆసనం వేయడం వల్ల మోకాళ్ల నొప్పిని దూరం చేసుకోవచ్చు. ఈ ఆసనం వేయడం కూడా చాలా తేలిక. ఈ ఆసనంతో మోకాళ్ల నొప్పులు దూరం అవడమే కాకుండా.. నడుపు కూడా స్ట్రాంగ్ గా అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆసనాన్ని ఎలా వేస్తారంటే:

మీ పాదాలను దూరంగా చాపి.. నిటారుగా నిల్చోవాలి. ఇప్పుడు చేతులను సమాంతరంగా చాపి.. ఒక చేత్తో ఒక పాదాన్ని టచ్ చేయాలి. మరో చేతిని ఆకాశం వైపు చూపించాలి.

వృక్షాసనం:

వృక్షాసనంతో మోకాళ్ల నొప్పులనే కాకుండా.. కండరాలను బలపరుస్తుంది. అలాగే శారీరాన్ని ఉత్తేజపరుస్తుంది.

ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే:

ఈ ఆసనం వేయడం చాలా తేలిక. ముందుగా రెండు పాదాలను దగ్గరగా పెట్టి నిటారుగా నిల్చోవాలి. ఇప్పుడు ఎడమ కాలిని తీసుకెళ్లి.. కుడి కాలి మోకాలి దగ్గర ఉంచాలి. రెండు చేతులను సమాంతరంగా పైకి లేపి.. నమస్కారం చేయాలి.

త్రికోణాసనం:

త్రికోణాసనంతో మోకాళ్ల నొప్పులను ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే కండరాలను కూడా గట్టి పరుస్తుంది. మోకాలి చుట్టూ ఉన్న కండరాలను స్ట్రెచ్ చేసి దృఢంగా మారుస్తుంది.

ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే:

ఈ ఆసనం వేయడానికి ముందు రెండు పాదాలను దూరంగా చాచి నిటారుగా నిల్చోవాలి. చేతులను కూడా నేలకు సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు ఒక పాదాన్ని టచ్ చేసేందుకు ఒక వైపు వంగాలి. కుడి చేతితో.. కుడి పాదాన్ని తాకాలి. మరో ఎడమ చేయి ఆకాశంపై చూడాలి.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు