- Telugu News Photo Gallery How to get rid of oil stains on clothes with cornstarch, check here is details
Kitchen Tips: మొక్కొజొన్న పిండితో బట్టలపై ఆయిల్ మరకలను ఇలా మాయం చేసేయండి!
మొక్క జొన్న పిండితో బట్టలపై మరకలను పోగొట్టొచ్చన్న విషయం మీకు తెలుసా. సాధారణంగా మొక్క జొన్న పిండితో వంటలు చేస్తాం. చైనీస్ వంటల్లో అయితే గ్రేవీ చిక్కగా రావడానికి మొక్క జొన్న పిండిని వాడతారు. అలాగే సూప్స్ లో కూడా కార్న్ ఫ్లోర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. వీటితో టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే ఇంట్లోని వస్తువులను క్లీన్ చేయడానికి కూడా కార్న్ స్టార్చ్ ని వాడుతూంటారు. అంతే కాకుండా బట్టలపై మొండి మరకలను వదిలించుకోవడానికి కూడా కార్న్ ఫ్లోర్ ని వాడతారన్న విషయం చాలా కొద్ది..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Oct 26, 2023 | 10:50 PM

మొక్క జొన్న పిండితో బట్టలపై మరకలను పోగొట్టొచ్చన్న విషయం మీకు తెలుసా. సాధారణంగా మొక్క జొన్న పిండితో వంటలు చేస్తాం. చైనీస్ వంటల్లో అయితే గ్రేవీ చిక్కగా రావడానికి మొక్క జొన్న పిండిని వాడతారు. అలాగే సూప్స్ లో కూడా కార్న్ ఫ్లోర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. వీటితో టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే ఇంట్లోని వస్తువులను క్లీన్ చేయడానికి కూడా కార్న్ స్టార్చ్ ని వాడుతూంటారు.

అంతే కాకుండా బట్టలపై మొండి మరకలను వదిలించుకోవడానికి కూడా కార్న్ ఫ్లోర్ ని వాడతారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. మొక్క జొన్న పిండితో మరకలను ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బట్టలపై అప్పుడప్పుడు ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి. ఇవి అంత తొందరగా పోవు. అలాంటప్పుడు మొక్క జొన్న పిండితో వాటిని వదిలించు కోవచ్చు.

నూనె పడిన ప్రాంతంలో పిండిని చల్లాలి. దానిని అలానే ఓ 12 గంటల పాటు వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల బట్టలపై పడిన నూనె.. పిండి పీల్చుకుంటుంది. ఆ తర్వాత బట్టలను వాష్ చేసుకుని ఎండలో ఆరేస్తే సరిపోతుంది. ఇలా ఈ పిండితో ఈజీగా మరకలను వదిలించుకోవచ్చు.

కార్న్ స్టార్చ్ తో కూడా నూనె మరకలను వదిలించుకోవచ్చు. నూనె పడిన ప్రాంతంలో కార్న్ స్టార్చ్ పేస్ట్ ని రాసి.. ఓ ఐదు గంటలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత వాష్ చేసుకోవాలి. కేవలం నూనె మరకలే కాకుండా.. ఎలాంటి మరకలైనా ఈ పేస్ట్ తో వదిలించుకోవచ్చు. జిడ్డు కూడా పోతుంది. ఈజీగా వాష్ చేసుకోవచ్చు.

మొక్క జొన్న పిండితో ఇంకా వెండి వస్తువులను, గాజు వస్తువులను, తలుపులు, మరకలు పడిన గోడలను కూడా శుభ్ర పరుచుకోవచ్చు. దీని వల్ల అవి కొత్త వస్తువుల్లా బాగా మెరుస్తాయి. రెగ్యులర్ గా కాకపోయినా నెలకి ఒకసారైనా క్లీన్ చేసుకోవచ్చు.





























