పోకో ఎక్స్5 5జీ.. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. వెనుకవైపు 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ స్నాపర్, 2ఎంపీ మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జర్ సపోర్టుతో వస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర రూ. 14,499గా ఉంది.