- Telugu News Photo Gallery Technology photos Best gaming laptops in 50k range, Check here for full details
Gaming Laptops: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్.. ఫీచర్స్ అదుర్స్ అంతే..
ల్యాప్‌టాప్‌ను గేమింగ్ కోసం ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ల్యాప్‌టాప్‌తో వర్క్ చేయడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో గేమింగ్ కూడా అంతే సపోర్ట్ చేసుకునేలా చూసుకుంటున్నారు. అందుకే మార్కెట్లో గేమింగ్ ల్యాప్‌టాప్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. మరి ఫ్లిప్ కార్ట్ సేల్‌లో రూ. 50 వేలలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Oct 27, 2023 | 2:31 PM

Acer Aspire 7 Core i5: అసర్ కంపెనీకి చెందిన ఈ ల్యాప్టాప్ అసలు ధర రూ. 78,999 కాగా 31 శాతం డిస్కౌంట్‌తో రూ. 53,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఐపీఎస్ టెక్నాలజీ ఈ స్క్రీన్ సొంతం. ఇందులోని ప్రాసెసర్ గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ గ్రాఫిక్ కార్డు, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఈ ల్యాప్‌టాప్ సొంతం.

ASUS Vivobook Pro 15: అసూస్ కంపెనీకి చెందిన ఈ ల్యాప్టాప్ అసలు ధర రూ. 49,990కాగా 34 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 49,990కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఈ ల్యాప్‌టాప్‌లో 34 జీబీ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డును అందించారు. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఈ ల్యాప్‌టాప్ సొంతం.

HP Victus Core i5 12th Gen: హెచ్‌పీ కంపెనీకి చెందిన కోర్ ఐ5, 12th జెన్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 74,829 కాగా, 21 శాతం డిస్కౌంట్‌తో రూ. 58,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. సూపర్ గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్‌ను అందించారు.

Lenovo IdeaPad Gaming 3: లెనెవో కంపెనీకి చెందిన ఈ ల్యాప్టాప్ అసలు ధర రూ. 73,490కాగా, 34 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 47,990కే సొంతం చేసుకోవచ్చు. గేమింగ్ 3 మోడల్ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ బ్యాకప్ 8 గంటల వరకు ఇస్తుంది. ఇక ఇందులో 4జీబీ గ్రాఫిక్ కార్డును అందించారు. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

MSI GF63 Core i5 11th Gen 11260H: రూ. 50 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్‌లో ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గేమింగ్‌కు పర్‌ఫెక్ట్‌గా నిలిచే ఈ ల్యాప్టాప్ అసలు ధర రూ. 70,990కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 47,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. కోర్‌ఐ5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 16జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీని ఇచ్చారు.





























