- Telugu News Photo Gallery New sandals are pouring? these tips will help you a lot, check here is details
Sandals Tips: చెప్పులు కరుస్తున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి!
ఎన్ని చెప్పులు ఉన్నా.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనకు నచ్చితే కొత్త చొప్పులు కొంటూంటాం. ఇలా పార్టీ వేర్, ఆఫీస్ వేర్, నార్మల్, హీల్స్ అని రకరకాలు ఉంటాయి. అయితే కొత్త చెప్పులు వేసుకుంటే కాస్త ఇబ్బందిగా ఉంటాయి. పాదాలకు రాసుకుంటూ ఉంటాయి. దీంతో కాళ్లు బొబ్బలు, దద్దుర్లు, గాయాలు అనేవి అవుతూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉండి.. సౌకర్యవంతంగా నడవలేరు. మరి చొప్పులు కరవకుండా ఉండేందుకు ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి. కొత్త చొప్పులు కాస్త హార్డ్ గా ఉంటాయి కాబట్టి.. కొత్త చొప్పులు వేసుకునే ముందు కాళ్లకు కొబ్బరి నూనె లేదా..
Updated on: Oct 25, 2023 | 9:37 PM

ఎన్ని చెప్పులు ఉన్నా.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనకు నచ్చితే కొత్త చొప్పులు కొంటూంటాం. ఇలా పార్టీ వేర్, ఆఫీస్ వేర్, నార్మల్, హీల్స్ అని రకరకాలు ఉంటాయి. అయితే కొత్త చెప్పులు వేసుకుంటే కాస్త ఇబ్బందిగా ఉంటాయి. పాదాలకు రాసుకుంటూ ఉంటాయి. దీంతో కాళ్లు బొబ్బలు, దద్దుర్లు, గాయాలు అనేవి అవుతూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉండి.. సౌకర్యవంతంగా నడవలేరు. మరి చొప్పులు కరవకుండా ఉండేందుకు ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి. అవేంటో తెలుసుకోండి.

కొత్త చొప్పులు కాస్త హార్డ్ గా ఉంటాయి కాబట్టి.. కొత్త చొప్పులు వేసుకునే ముందు కాళ్లకు కొబ్బరి నూనె లేదా పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకుంటే మంచింది. ఒరుసుకుంటే మాత్రం బ్యాండెయిడ్ లేదా సర్జికల్ టేప్ వేయండి.

కొత్త షూలు వేసుకుంటే మాత్రం.. షూలో బేబీ పౌడర్ ని చల్లి.. వేసుకుంటే బొబ్బలు రాకుండా ఉంటాయి. కొత్త చొప్పులు వేసుకున్నప్పుడు.. కరవకుండా ఉండాలంటే డియోడరెంట్ లేదా హెయిర్ సీరమ్ అప్లై చేసుకోవాలి.

చాలా మంది హై హీల్స్ వేసుకున్నప్పుడు లేదా కొత్త బూట్లతో నడుస్తున్నప్పుడు ఇబ్బంది పడతారు. ఆ సమస్యలు తగ్గించుకోవాలంటే.. హీల్ గ్రీప్స్ లేదా హై హీల్ ప్యాడ్స్ ని ఉపయోగిస్తే సౌకర్యవంతంగా నడవచ్చు.

చెప్పులు కరిచిన చోట ఐస్ క్యూబ్స్ కాపడం పెడితే మంచిది. అలాగే ఆలీవ్, బాదం నూనెను సమపాలల్లో తీసుకుని మిక్స్ చేసి.. చొప్పులు కరిచిన చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జు కూడా రాసుకోవచ్చు. ఇది నొప్పి, మంటను తగ్గిస్తుంది.




