- Telugu News Photo Gallery Cinema photos Balakrishna bhagavanth kesari Movie 1 Million Tickets sold on BookMyShow.
Bhagavanth kesari: సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసిన బాలయ్య భగవంత్ కేసరి. అదేంటంటే
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది.
Updated on: Oct 26, 2023 | 7:28 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది.

ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమాకు వసూళ్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది భగవంత్ కేసరి సినిమా.

తాజాగా భగవంత్ కేసరి సినిమా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. బుకింగ్ బుక్ మై షో యాప్ లో ఇప్పటివరకు 1 మిలియన్ కి పైగా టికెట్స్ బుక్ చేసుకుని రికార్డు సెట్ చేసింది బాలయ్య భగవంత్ కేసరి సినిమా.




