- Telugu News Photo Gallery Cinema photos Internet Discussing Price Of Mahesh Babu Sandals in Guntur kaaram movie new Poster
Mahesh Babu: బాబు రేంజ్ మాములుగా ఉండదు మరి.. ఈ పోస్టర్‌లో మహేష్ వేసుకున్న చెప్పుల ధర తెలుస్తే అవాక్ అవ్వాల్సిందే..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
Updated on: Oct 26, 2023 | 8:48 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాను మాస్ మాసాల ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అలాగే గుంటూరు కారం సినిమా నుంచి మహేష్ బాబు మాస్ లుక్స్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే మహేష్ బాబు న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దసరా సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో మహేష్ బాబు వేసుకున్న చెప్పుల ధర హాట్ టాపిక్ గా మారింది. ఎకో అఫ్రోడ్ అనే కంపెనీ తయారు చేసిన వీటి ధర రూ.7,999 ఉంది.




