Interesting Facts: క్యారెట్లను అసలు ఎలా తింటే మంచిదో తెలుసా? ఇలా తింటే బోలెడన్ని బెనిఫిట్స్!

మనం తీసుకునే ఆహారంలో క్యారెట్లు కూడా ఒకటి. ఇవి దుంప జాతికి చెందినవి. క్యారెట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యారెట్లతో కూరలు, వేపుళ్లు, సలాడ్స్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొంత మంది క్యారెట్ తో హల్వా కూడా చేస్తారు. క్యారెట్లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. చాలా మందికి క్యారెట్లను ఎలా తీసుకుంటే మంచిదో తెలీదు. ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు. అయితే క్యారెట్లను ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు వివరంగా..

Interesting Facts: క్యారెట్లను అసలు ఎలా తింటే మంచిదో తెలుసా? ఇలా తింటే బోలెడన్ని బెనిఫిట్స్!
Carrots
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 9:30 PM

మనం తీసుకునే ఆహారంలో క్యారెట్లు కూడా ఒకటి. ఇవి దుంప జాతికి చెందినవి. క్యారెట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యారెట్లతో కూరలు, వేపుళ్లు, సలాడ్స్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొంత మంది క్యారెట్ తో హల్వా కూడా చేస్తారు. క్యారెట్లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. చాలా మందికి క్యారెట్లను ఎలా తీసుకుంటే మంచిదో తెలీదు. ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు. అయితే క్యారెట్లను ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

క్యారెట్లను ఎలా తీసుకోవాలి:

చాలా క్యారెట్లను జ్యూస్ రూపంలో ఎక్కువగా వడకట్టి తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం తప్పు అని అంటున్నారు నిపుణులు. క్యారెట్లను నమిలి తింటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి క్యారెట్లను నమిలి తింటేనే బెటర్.

ఇవి కూడా చదవండి

క్యారెట్లలో పోషకాలు:

100 గ్రాముల క్యారెట్స్ లో 48 క్యాలరీల శక్తి ఉంటాయి. 69 మైక్రో గ్రాముల సోడియం. 320 మైక్రో గ్రాముల పొటాషియం, 9 శాతం విటమిన్ సీ, 5 శాతం విటమిన్ బి6, మూడు శాతం మెగ్నీషియం, క్యాల్షియం, 2.8 గ్రాముల ఫైబర్, ఎక్కువ మోతాదులో బీటా కెరోటీన్ ఉంటుంది.

బీటా కెరోటీన్ యూజ్:

క్యారెట్లలో ఉండే బీటా కెరోటీన్ కాలేయంలోకి వెళ్లగానే విటమిన్ ఎగా మారిపోతుంది. బీటా కెరోటీన్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నశింప జేసి అనారోగ్య సమస్యల నుంచి కాపాడటంలో కూడా బీటా కెరోటీన్ బాగా పని చేస్తుంది.

కంటి చూపు మెరుగు పడుతుంది:

క్యారెట్లను తీసుకోవడం వల్ల కంటి చూపు అనేది మెరుగు పడుతుంది. అంతే కాకుండా మాక్యులర్ డిజెనరేషన్ సమస్యలు రాకుండా ఉంటాయి.

జీర్ణ శక్తి పెరుగుతుంది:

క్యారెట్ లలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తిన్న ఆహారం తిన్నట్టు అరిగిపోతుంది. దీంతో మల బద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది.

షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి:

క్యారెట్స్ తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. బ్లడ్ లోని షుగర్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..