Vastu Tips: ఈ మొక్కలను ఇంట్లో పెంచితే.. అదృష్టం కలిసి వస్తుంది!

ఇంట్లోని అందరూ సంతోషంగా, శ్రేయస్సుతో ఉండాలంటే.. వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. ఇంట్లో సరైన విధంగా వాస్తు లేకపోతే.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం తాండవిస్తుంది. ఇలాంటివేమీ లేకుండా ఉండాలంటే.. కొన్ని రకాల వాస్తు టిప్స్ మనకు బాగా సహకరిస్తాయి. ఇంట్లోని వస్తువులు, మనుషులకే కాదు.. మొక్కలను పెంచడానికి కూడా వాస్తు ఉంటుందన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కొన్ని రకాల మొక్కలను ఈ దిక్కుల్లో..

Vastu Tips: ఈ మొక్కలను ఇంట్లో పెంచితే.. అదృష్టం కలిసి వస్తుంది!
Lucky Plants
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 25, 2023 | 9:34 PM

ఇంట్లోని అందరూ సంతోషంగా, శ్రేయస్సుతో ఉండాలంటే.. వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. ఇంట్లో సరైన విధంగా వాస్తు లేకపోతే.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం తాండవిస్తుంది. ఇలాంటివేమీ లేకుండా ఉండాలంటే.. కొన్ని రకాల వాస్తు టిప్స్ మనకు బాగా సహకరిస్తాయి. ఇంట్లోని వస్తువులు, మనుషులకే కాదు.. మొక్కలను పెంచడానికి కూడా వాస్తు ఉంటుందన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కొన్ని రకాల మొక్కలను ఈ దిక్కుల్లో పెడితే.. ఇంట్లో ఆరోగ్యం, అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ మొక్కలు ఏంటి? వాటిని ఏ దిక్కుల్లో పెడితే మంచిదో ఇప్పుడు చూద్దాం.

అరటి చెట్టు:

అరటి చెట్టును విశాలంగా ఉంటుంది కాబట్టి.. చాలా మంది దీన్ని ఇంట్లో పెంచరు. కానీ దీన్ని కూడా చిన్న కుండీల్లో నాటవచ్చు. ఈ అరటి చెట్టు తూర్పు దిక్కన పెట్టాలి. అరటి చెట్టును ఇంట్లో పెంచడం వల్ల శ్రేయస్సు పెరుగుతుంది. అంతే కాకుండా అరటి చెట్టు దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్ర పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మనీ ప్లాంట్:

ఇప్పుడు ఈ మొక్క అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదిగితే.. ఇంట్లో కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండని అందరూ భావిస్తూంటారు. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంటి ఆగ్రేయ మూలలో ఉంచాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగుతాయి.

అశోక చెట్టు:

అశోక చెట్టుకు మంచి శుభ శక్తులు ఉంటాయని నమ్మకం. అందుకే దీన్ని పవిత్రమైన మొక్కగా గుర్తిస్తారు. ఈ చెట్టు ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. ఇది ఇంటికి సాను కూల శక్తిని తెస్తుంది.

తులసి మొక్క:

తులసి మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మొక్క గురించి అందరికీ తెలుసు. తులసి మొక్కను కూడా పవిత్రమైన మొక్కగా భావించి పూజలు అనేవి చేస్తూంటారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగి.. కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు. తులసిని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో పెట్టాలి. ఇలా పెడితే శుభ ఫలితాలు ఉంటాయి. తులసి మొక్క అస్సలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయదు. కాబ్టటి ఇది ఆరోగ్యంగా కూడా చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.

లక్కీ బ్యాంబూ మొక్క:

ఇప్పుడు చాలా మంది లక్కీ బ్యాంబూ మొక్కను కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు. ఈ మొక్క సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. అందుకే ఇది ఇండోర్ ప్లాంట్ గా బాగా ప్రాచూర్యం పొందింది. ఈ మొక్కను ఇల్లు లేదా ఆఫీసుల్లో ఉంచడం వల్ల అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది.