గుడ్లు నెలల తరబడి చెడిపోకుండా ఉండాలంటే వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో తెలుసా..?

ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. తాజా గుడ్లు నీటిలో ఉంచిన వెంటనే మునిగిపోతాయి. కాని చెడు గుడ్లు నీటిలో తేలుతాయి. కాబట్టి గుడ్డు తినదగినదా కాదా అని ముందే చెక్‌ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో మంచి చల్లని నీరు తీసుకుని అందులో గుడ్డు ఉంచండి. మీరు దానిని కాస్త అటు ఇటుగా కదిలించి కూడా చూడొచ్చు. అది శబ్దం చేస్తే అది పాడైందని అర్థం.

గుడ్లు నెలల తరబడి చెడిపోకుండా ఉండాలంటే వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో తెలుసా..?
Eggs
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 26, 2023 | 5:37 PM

గుడ్లు మంచి ప్రోటీన్ ఫుడ్‌ అని మనందరికీ తెలుసు. అలాగే, ఇందులో ఉండే వేడి గుణాల వల్ల చలికాలంలో గుడ్లు తినడం వల్ల శరీరం లోపల నుండి వెచ్చగా ఉంటుంది. అయితే, చాలా మంది మార్కెట్ నుండి ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లను కొనితెచ్చుకుంటారు. దీంతో డబ్బు, సమయం ఆదా అవుతుందని భావిస్తారు. అలాంటప్పుడు వాటిని ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా భద్రపరచాలో మీకు తెలుసా..?

ఎక్కువ కోడిగుడ్లు కొనితెచ్చుకుంటే..వాటిని ఎక్కువ కాలం ఉపయోగించడం కష్టం. ఎందుకంటే కొన్ని గుడ్లు చెడిపోవడం ప్రారంభిస్తాయి. అయితే, మీరు గుడ్లను నిల్వ చేయడం, ఎక్కువరోజులు తాజాగా ఉంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. గుడ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా నిల్వ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. తాజా గుడ్లు నీటిలో ఉంచిన వెంటనే మునిగిపోతాయి. కాని చెడు గుడ్లు నీటిలో తేలుతాయి. కాబట్టి గుడ్డు తినదగినదా కాదా అని ముందే చెక్‌ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో మంచి చల్లని నీరు తీసుకుని అందులో గుడ్డు ఉంచండి. మీరు దానిని కాస్త అటు ఇటుగా కదిలించి కూడా చూడొచ్చు. అది శబ్దం చేస్తే అది పాడైందని అర్థం.

ఇవి కూడా చదవండి

గుడ్లను నిల్వ చేయడానికి సులభమైన, ఉత్తమమైన మార్గం వాటిని ఫ్రిజ్ మధ్య రాక్‌లో నిల్వ చేయడం. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. గుడ్డును డోర్‌ సైడ్‌లో పెడితే చెడిపోయే ప్రమాదం ఎక్కువ.

మీరు గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదనుకుంటే, వాటిని జ్యూట్ బ్యాగ్ లేదా మట్టి కుండలో నిల్వ చేయవచ్చు. గుడ్లను డబ్బాలతో పాటు జ్యూట్ బ్యాగ్‌లో ఉంచడం ద్వారా చాలా రోజులు తాజాగా ఉంచవచ్చు. అంతే కాదు ఎండు గడ్డి మధ్యలో కూడా పెట్టుకోవచ్చు

అద్భుతమైన కోడిగుడ్డును ఎక్కువ కాలం తాజాగా ఉంచి, దానిపై మినరల్ ఆయిల్ రాసి, ఎండలో కాసేపు ఉంచడం కూడా ఒక పద్ధతి. తర్వాత దాన్ని మళ్లీ డబ్బాల్లో ప్యాక్ చేసి కిచెన్ రాక్‌లో భద్రపరుచుకోండి. ఇలా చేయడం వల్ల గుడ్లు ఒక నెల వరకు తాజాగా ఉంటాయి.

అయితే, ఇక్కడ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సుమారు నెల రోజుల పాటు ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ ఉంచవచ్చు. అదే బయటైతే మాత్రం ఒక వారం పాటు ఉండవచ్చు. అంతకుమించి నిల్వ ఉంచితే మాత్రం గుడ్లు చెడిపోతాయని అంటున్నారు. అందుకే మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో కొని తెచ్చుకున్న గుడ్లను జాగ్రత్తగా నిల్వచేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?