కొత్త ఆన్‌లైన్ స్కామ్‌లో ఐఏఎస్ అధికారి.. ఏకంగా రూ. 5 లక్షలు పోగొట్టుకున్నారు.. ఏం జరిగిందంటే..

తనకే తెలియకుండా రామ్ బ్యాంక్ ఖాతాలో రూ.29.78 కోట్లు ఊహించని విధంగా వచ్చి చేరాయి. దాంతో అతడు తొలుత కాస్త షాక్ అయ్యాడు.. ఆ తర్వాత క్రెడిట్ మెసేజ్‌ విషయమై అప్రమత్తంగా వ్యవహరించి ఈ విషయాన్ని బ్యాంకుకు తెలియజేశారు. ఈ క్రమంలోనే..రామ్‌కి తెలియని మొబైల్ నంబర్ నుండి కాల్ వచ్చింది. బ్యాంక్ సీనియర్ అధికారి అయిన అవినాష్ అని తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి, రామ్ ఖాతాలో పొరపాటున డబ్బు జమ అయిందని చెప్పాడు.

కొత్త ఆన్‌లైన్ స్కామ్‌లో ఐఏఎస్ అధికారి.. ఏకంగా రూ. 5 లక్షలు పోగొట్టుకున్నారు.. ఏం జరిగిందంటే..
Online Fraud
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 26, 2023 | 5:05 PM

దేశంలో ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాల కేసులు పెరిగిపోతున్నాయి. డబ్బును కొల్లగొట్టేందుకు మోసగాళ్లు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఓ ఐఏఎస్ అధికారి కూడా నిలువునా మోసపోవటం సంచలనంగా మారింది. లక్నోలోని ప్రాగ్‌ నారాయణ్‌ రోడ్డులో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామ్‌ కున్వర్‌ ఆన్‌లైన్‌లో మోసపోయి రూ.5 లక్షలు పోగొట్టుకున్నారు. అంతే కాదు ఈసారి ఎవరూ ఊహించనంత కొత్త పద్ధతిని అనుసరించిన మోసగాళ్లు ఐఏఎస్ అధికారి ఖాతాను హ్యాక్ చేశారు. ఈ మోసం కేసు సినిమా స్టయిల్‌లో జరిగింది. తొలుత ఐఏఎస్ అధికారిని మెసేజ్ ద్వారా సంప్రదించిన మోసగాళ్లు ఆ తర్వాత అతడి అకౌంట్‌ను హ్యాక్ చేశారు. అక్టోబర్ 3న రామ్ మొబైల్‌కి 29.78 కోట్ల రూపాయలు క్రెడిట్ అయినట్టుగా మెసేజ్‌ వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఇది బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ కాదని తెలిసింది. అయితే ఈ మెసేజ్‌ పంపినవారు ఎవరనే కోణంలో విచారించగా..రామ్‌కు బ్యాంకు అధికారుల నుంచి సరైన సహకారం లభించలేదు.

తనకే తెలియకుండా రామ్ బ్యాంక్ ఖాతాలో రూ.29.78 కోట్లు ఊహించని విధంగా వచ్చి చేరాయి. దాంతో అతడు తొలుత కాస్త షాక్ అయ్యాడు.. ఆ తర్వాత క్రెడిట్ మెసేజ్‌ విషయమై అప్రమత్తంగా వ్యవహరించి ఈ విషయాన్ని బ్యాంకుకు తెలియజేశారు. అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఈ మెసేజ్ బ్యాంక్ నుండి వచ్చినది కాదని చెప్పటంతో రామ్ దీని గురించి విచారణ చేయాలనే ఉద్దేశ్యంతో బ్యాంక్ జోనల్ మేనేజర్‌కి తెలియజేశాడు.. అయితే జోనల్ మేనేజర్ కూడా ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, దీనిపై విచారణ జరుపుతామని బ్యాంకు జూనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే..రామ్‌కి తెలియని మొబైల్ నంబర్ నుండి కాల్ వచ్చింది. బ్యాంక్ సీనియర్ అధికారి అయిన అవినాష్ అని తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి, రామ్ ఖాతాలో పొరపాటున డబ్బు జమ అయిందని చెప్పాడు. అలాగే ఈ కేసును సెటిల్ చేసేందుకు AnyDesk యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. దీంతో వారు చెప్పిన విధంగానే.. రామ్ తనకు తెలియకుండానే తన సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఖాతాల సీక్రెట్‌ సమాచారాన్నంతా షేర్‌ చేశాడు.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే రామ్ సెంట్రల్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.65 లక్షలు డ్రా అయ్యాయి. డబ్బు డెబిట్‌ అయినట్టుగా వెంటనే మెసేజ్‌ కూడా వచ్చింది. అలాగే యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు డెబిట్‌ అయినట్టుగా మరో మెసేజ్‌ వచ్ఇచంది. అప్పటికీ గానీ, రామ్‌కి అర్థం కాలేదు..తనకు వచ్చిన మెసేజ్‌ కూడా ఫేక్‌ అని ఆ తర్వాత అర్థం చేసుకున్న రామ్‌ తాను మోసపోయానని గ్రహించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన రామ్‌ వెంటనే.. పోలీసులను ఆశ్రయించాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

AnyDesk యాప్ ద్వారా మరొక వ్యక్తి మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో సమాచారాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ యాప్‌ని ఉపయోగించి ఎవరైనా మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతించే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..