AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసిన యువకుడి వీరంగం.. వీడియో వైరల్‌..

దిశా షెరావత్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షల మందికి పైగా వీక్షించారు. కొద్దిరోజుల క్రితం మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యాక్‌ప్యాక్‌లు ధరించిన ఇద్దరు యువకులు రైలులోపల తలపడ్డారు. మీ ఫైటింగ్‌ ఆపాలంటూ..తోటి ప్రయాణికులు ఎంతగా కోరినప్పటికీ వారు తమ గొడవను ఆపలేదు. ఇతర ప్రయాణికులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసిన యువకుడి వీరంగం.. వీడియో వైరల్‌..
Delhi Metro
Jyothi Gadda
|

Updated on: Oct 26, 2023 | 2:55 PM

Share

Delhi Metro: గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సరదా సంఘటనలు, కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్‌ రీల్స్‌ వంటి వింత పోకడలకు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్‌ అవుతుంటాయి. మెట్రోలో కొందరు చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు, యువతి యువకుల రోమాన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూశాం. మెట్రో ప్రయాణికుల మధ్య చిన్నచిన్న కార‌ణాల‌కే గొడ‌వ‌లు పడుతుండటం, వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు చాలా చూశాం. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక వృద్ధుడిపై తోటి ప్రయాణికుడు దుసురుగా ప్రవర్తించాడు.

వైరల్‌ అవుతున్న వీడియోలో మెట్రో రైలు కోచ్‌లో నిలబడి ఉన్న ఒక వృద్ధ ప్రయాణికుడిపై తోటి వ్యక్తి వాగ్వాదానికి దిగటం కనిపించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి సదరు పెద్దమనిషిపై ఒక్కసారిగా దాడికి దిగాడు…అది గమనించిన తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పెద్దాయనకు సాయంగా నిలిబడ్డారు.. దాడి చేసిన వ్యక్తిని వారిస్తూ.. దూరంగా నెడుతున్నారు. అంతా కలిసి అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే, అక్కడ జరిగిన గొడవకు కారణంగా మాత్రం తెలియారాలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వెల్‌కమ్ టు ఢిల్లీ మెట్రో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

దిశా షెరావత్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్ చేసింది. దిశా సెహ్రావత్ (@sehrawatdisha19) అనే ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్‌ చేశారు. అయితే, వృద్ధుడిపై యువకుడు ఎందుకు దాడి చేశాడో స్పష్టంగా తెలియరాలేదు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు. యువకుడిని వ్యతిరేకిస్తూ పెద్దాయనపై దాడిని ఖండించారు. దిశా షెరావత్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షల మందికి పైగా వీక్షించారు. కొద్దిరోజుల క్రితం మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యాక్‌ప్యాక్‌లు ధరించిన ఇద్దరు యువకులు రైలులోపల తలపడ్డారు. మీ ఫైటింగ్‌ ఆపాలంటూ..తోటి ప్రయాణికులు ఎంతగా కోరినప్పటికీ వారు తమ గొడవను ఆపలేదు. ఇతర ప్రయాణికులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..