Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని ఆ చిన్న నగరాన్ని ఊపిరాడకుండా చేస్తున్న వాయుకాలుష్యం.. దేశంలోనే అతి దారుణంగా పరిస్థితి..

ఇలాంటి వాతావరణం ఉన్న చోట మాస్క్ ధరించడం శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. తాజా రిపోర్ట్ పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గాలి కాలుష్యం కారణంగా 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్రిమి సంహరక మందులు ఎక్కువగా వాడడం, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, రసాయనాల వినియోగం ఇలాంటి కాలుష్యాలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

Andhra Pradesh: ఏపీలోని ఆ చిన్న నగరాన్ని ఊపిరాడకుండా చేస్తున్న వాయుకాలుష్యం.. దేశంలోనే అతి దారుణంగా పరిస్థితి..
Nellore Air Pollution
Follow us
Ch Murali

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 25, 2023 | 1:01 PM

నెల్లూరు, అక్టోబర్25; గాలి నాణ్యత పరిణామం అనేది జీవ ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంది. గాలి నాణ్యత అనేది ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటే అది ప్రమాదాన్ని సూచిస్తుంది. సాధారణంగా గాలి నాణ్యతను 0 నుంచి 500 పాయింట్ల వరకు కొలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయాదేశాల్లోని ప్రధాన నగరాల్లో ఎప్పటికప్పుడు గాలి నాణ్యత ఏవిధంగా ఉంది అనేది పర్యవేక్షణ జరుగుతుంటుంది. ప్రపంచ దేశాల కంటే భారత్ లో గాలి నాణ్యత ఆందోళన కరంగా ఉంది అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. ఇక భారత్ లో ఢిల్లీ, చైనాలోని బీజింగ్ నగరంలో గాలి నాణ్యత పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నట్లు ఓ సర్వే చెబుతోంది. అలాంటిది ఇప్పుడు విడుదలైన తాజా రిపోర్ట్ ద్వారా భారత్ లో మరో నగరం ప్రమాదంలో ఉన్నట్లు తేలింది. ఢిల్లీ కంటే ఎక్కువ మోతాదులో గాలి నాణ్యత దెబ్బతిందని ఆ జాబితా చెబుతోంది. అది కూడా ఏమాత్రం మనం ఊహించలేని నగరం.. ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు నగరం. అవును దేశం మొత్తంలోని ప్రధానమైన మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, ముంబై, కలకత్తా మహా నగరాల్లో ఉన్న పరిస్థితి కంటే దారుణంగా ఉన్నట్లు తేలింది.

ఆంధ్రప్రదేశ్, నెల్లూరు 212

తెలంగాణ 101

ఇవి కూడా చదవండి

తమిళనాడు 87

ఢిల్లీ 191

గోవా 96

త్రిపుర 77

ఉత్తర ప్రదేశ్ 157

పంజాబ్ 114

రాజస్థాన్ 137

దామన్ 166

గుజరాత్ 149

ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాల కంటే ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు నగరంలో గాలి నాణ్యత సూచిక 212 ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఢిల్లీలో ఉండే గాలి నాణ్యత కంటే నెల్లూరులో ప్రస్తుతం నమోదైన గాలి నాణ్యత శాతం తీవ్ర ఆందోళనను సూచిస్తోంది.

ఇలాంటి పరిస్థితులు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె పై ఒత్తిడి పెంచుతుందని అంటున్నారు.. ఇలాంటి వాతావరణం ఉన్న చోట మాస్క్ ధరించడం శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. తాజా రిపోర్ట్ పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గాలి కాలుష్యం కారణంగా 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్రిమి సంహరక మందులు ఎక్కువగా వాడడం, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, రసాయనాల వినియోగం ఇలాంటి కాలుష్యాలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..