Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devaragattu: దేవరగట్టు కర్రల సమరంలో అంతులేని విషాదం.. ముగ్గురు మృతి, వంద మందికి పైగా గాయాలు

దేవరగట్టు కర్రల సంబరం చూసేందుకు ఈసారి ఎప్పుడూ లేని విధంగా ప్రజలు తరలివచ్చారు. తిలకించేందుకు భారీ ఎత్తున చెట్టు ఎక్కారు. బరువు తట్టుకోలేక చెట్టు కూలిపోయింది చెట్టు కింద ఉన్న ముగ్గురు అమాయకులు మృత్యువాత పడ్డారు బాల గణేష్ రామాంజనేయులు ప్రకాష్ అనే ముగ్గురు మృతి చెందారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా. మరోవైపు బన్నీ ఉత్సవంలో కర్రలు తలకు తగిలి 100 మందికి పైగా గాయపడ్డారు. కొందరికి కాళ్లు చేతులు..

Devaragattu: దేవరగట్టు కర్రల సమరంలో అంతులేని విషాదం.. ముగ్గురు మృతి, వంద మందికి పైగా గాయాలు
Devaragattu Bunny Festival
Follow us
J Y Nagi Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Oct 25, 2023 | 1:04 PM

దేవరగట్టు, అక్టోబర్‌ 25: దేవరగట్టు కర్రల సంబరం చూసేందుకు ఈసారి ఎప్పుడూ లేని విధంగా ప్రజలు తరలివచ్చారు. తిలకించేందుకు భారీ ఎత్తున చెట్టు ఎక్కారు. బరువు తట్టుకోలేక చెట్టు కూలిపోయింది చెట్టు కింద ఉన్న ముగ్గురు అమాయకులు మృత్యువాత పడ్డారు బాల గణేష్ రామాంజనేయులు ప్రకాష్ అనే ముగ్గురు మృతి చెందారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా. మరోవైపు బన్నీ ఉత్సవంలో కర్రలు తలకు తగిలి 100 మందికి పైగా గాయపడ్డారు. కొందరికి కాళ్లు చేతులు విరగ్గా మరికొందరికి తలలు పగిలాయి సీరియస్ గా ఉన్న వారిని ఆదోని కర్నూలు ఆలూరు ఆసుపత్రులకు తరలించారు.

మృతులలో గణేష్ ది ఆస్పరి కాగా రామాంజనేయులుది మొలగవల్లి కొట్టాల ప్రకాష్ ది బళ్లారి. చెట్టు కింద పడటంతో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్రల సమరంలో హింస జరుగుతుందని తెలిసి కూడా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేక పోయారు. జిల్లా ఎస్పీ ఉన్న బిల్డింగ్ కి సమీపంలోనే ఉన్న చెట్టు మీదికి భారీ ఎత్తున యువకులు ఎక్కారు వారిని కనీసం కిందికి దించే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. దీంతో కొమ్మలు విరిగి చెట్టు కింద ఉన్న వారిపై పడింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వచ్చారు కానీ డ్యూటీలో ఎక్కడ కూడా నిమగ్నమైనట్లు కనిపించలేదు. చెట్టు పక్కనే పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. చెట్టు ఎక్కిన వారిని దించి ఉంటే సంఘటన జరిగి ఉండేది కాదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు కూడా గతంలో స్పందించాయని భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా నియంత్రిస్తామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తో ఫేస్ టు ఫేస్

దేవరగట్టు కర్రల సమరం చూసేందుకు లక్షలమంది భక్తులు వస్తారని తెలిసి కర్ణాటక మద్యం పెద్ద ఎత్తున డంప్ అయ్యింది. ఈ కర్ణాటక మద్యం నియంత్రించడంలో పోలీసులు చేతులెత్తేశారు. ఇదే హింసకు ప్రధాన కారణమైందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈసారి సంఘటన జరిగిందని అంటున్న దేవరగట్టు బన్నీ ఉత్సవ నిర్వాహకులతో మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు.

ఇవి కూడా చదవండి

కర్రల చివర ఉన్న ఇనుప చివ్వలు తగి లి చాలామందికి తలలో పగిలాయి. కొందరికి కాళ్లు చేతులు విరిగాయి. అధికారికంగా 65 మంది వైద్యం తీసుకున్నారని సాధారణ గాయాలైన వారు ఆసుపత్రికి రాకుండానే వెళ్లిపోయారని జిల్లా వైద్యాధికారులు టీవీ9 తో అంటున్నారు.

రఘురాం రెడ్డి డిప్యూటీ డీఎంహెచ్ఓ కర్నూల్

కర్రల సమరం జరుగుతుందని అందులో హింస రక్తపాతం జరుగుతుందని అందరికీ ముందే తెలుసు. 20 రోజులు ముందే సమీక్ష కూడా చేశారు. అయినా కూడా అంతా ఉత్తిదే అని తేలిపోయింది. బందోబస్తుకు వచ్చినప్పుడు కనీసం డ్యూటీ కూడా చేయకపోవడం వల్లే హింస జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. పైగా కర్ణాటక మధ్యాహ్నం నియంత్రించలేకపోయారు. దీంతో మద్యం సేవించి రావడంతో కూడా సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.