ED Raids: ఎన్నికల వేళ రాజస్థాన్‌లో ఈడీ దాడులు.. పీసీసీ చీఫ్‌ గోవింద్‌సింగ్‌ నివాసంలో ఈడీ సోదాలు

ED Action on Ashok Gehlot Son: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఈడీ దాడులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పేపర్‌ లీక్‌ కేసులో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లీట్‌ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది.

ED Raids: ఎన్నికల వేళ రాజస్థాన్‌లో ఈడీ దాడులు.. పీసీసీ చీఫ్‌ గోవింద్‌సింగ్‌ నివాసంలో ఈడీ సోదాలు
Rajasthan Cm Ashok Gehlot's
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 26, 2023 | 5:59 PM

అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఈడీ దాడులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పేపర్‌ లీక్‌ కేసులో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లీట్‌ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది.

ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు రేపు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. పేపర్‌లీక్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో ఈడీ నేడు సోదాలు చేపట్టింది. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఈడీ దాడులచేయిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈడీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ఈడీ దాడులపై మండిపడ్డారు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌. గతంలో కర్నాటక ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ నివాసంలో ఈడీ సోదాలు చేసిందని , అప్పుడు కాంగ్రెస్‌ గెలిచిందన్నారు గెహ్లాట్‌. ఇప్పుడు రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. 200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఫలితాలను ప్రకటించనున్నారు.

రాజస్థాన్‌లో ప్రతిరోజూ ఈడీ దాడులు జరుగుతున్నాయని తాను నిరంతరం చెబుతున్నానని, మహిళలు, రైతులు, పేదలు ఇక్కడి పథకాల ప్రయోజనాలను పొందాలని బీజేపీ కోరుకోవడం లేదని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం హై ఓల్టేజీ డ్రామాగా మారుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి