Chandra Grahan 2023: రేపు చంద్రగ్రహణం సమయం.. సూతకం.. స్నానం దానం .. నియమాలు.. మీ కోసం
ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి 01:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సూతకం అక్టోబర్ 28 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ సూతకాలం చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది. ఈ రోజు చంద్రగ్రహణానికి సంబంధించిన నమ్మకాలు, నియమాలు మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
హిందూ మతంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు గ్రహణాలు అశుభకరంగా భావిస్తారు. రేపు ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. 28 అక్టోబర్ 2023న శరత్ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించబోతోంది. పాక్షిక చంద్ర గ్రహణం భారతదేశం సహా అనేక దేశాల్లో కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి 01:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సూతకం అక్టోబర్ 28 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ సూతకాలం చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది. ఈ రోజు చంద్రగ్రహణానికి సంబంధించిన నమ్మకాలు, నియమాలు మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి అశ్వినీ నక్షత్రంలో సంభవించే గ్రహ చంద్రగ్రహణం సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం.
- జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం.. చంద్రగ్రహణం మేష రాశి అశ్విని నక్షత్రంలో సంభవిస్తుంది.. కనుక దీని ప్రభావాన్ని నివారించడానికి.. ఈ రాశి, నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పొరపాటున కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, వృశ్చికం, కుంభం రాశుల వారికి ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం శుభప్రదంగా ఉంటుంది. అదే సమయంలో మేష, కన్య, తుల, మకరం, మీన రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
- హిందూ విశ్వాసం ప్రకారం చంద్రగ్రహణ సూతక కాలం ఎల్లప్పుడూ 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో రేపు సాయంత్రం 4 గంటల నుండి చంద్రగ్రహణ సూతకం ప్రారంభమవుతుంది.
- హిందువుల విశ్వాసం ప్రకారం సూతకాల కాలంలో పూజలు, వంటగది మొదలైన వాటికి సంబంధించిన ఏ పని చేయకూడదు.
- చంద్రగ్రహణ కాల సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
- హిందువుల విశ్వాసం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. అంతేకాదు దుస్తులు నేయడం, నూలు వడకడం వంటివి చేయకూడదు.
- చంద్రగ్రహణం సమయంలో దేవతామూర్తుల విగ్రహాలు, దేవాలయాలు మొదలైన వాటిని తాకడం నిషిద్ధం అయితే ఈ సమయంలో మీరు దైవాన్ని మనసులో స్మరించుకోవచ్చు, మంత్రాలు పఠించవచ్చు.
- చంద్రగ్రహణం సమయంలో.. ఓం సన్ సోమాయ నమః’ లేదా ‘ ఓం శ్రమ శ్రీం శ్రూం సః చంద్రమసే నమః ||. || ॐ శ్రాం శ్రీం శ్రౌం స: చంద్రమసే నమ:’ అనే మంత్రాన్ని జపించండి.
- చంద్రగ్రహణం ముగిసిన తరువాత నది స్నానం చేయాలి. లేదా తీర్థయాత్రకు వెళ్లాలి లేదా ఇంట్లో ఉన్న నీటిలో గంగాజలాన్ని జోడించి స్నానం చేయాలి. అనంతరం అవసరమైన వ్యక్తికి దానం చేయడం మంచిది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.