వారు జాగ్రత్త! నమ్మినవారు మోసగించే అవకాశం.. చంద్ర గ్రహణ ఫలితం ఎలా ఉండబోతోంది?
చంద్రుడితో గురు గ్రహం కలిసి ఉండడం, తులా రాశిలో ఉన్న రవితో బుధుడు కలిసి ఉండడం వల్ల ఈ గ్రహణ దుష్ప్రభావం బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రవి, చంద్రులు ఒంటరిగా ఉన్నప్పుడు గ్రహణం పట్టడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే, రవితో బుధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడడం, చంద్రుడితో గురువు కలవడం వల్ల గజకేసరి ఏర్పడడం వల్ల గ్రహణానికి సంబంధించిన దుష్ఫలితాలు బాగా తగ్గిపోవడం జరుగుతుంది.

Chandra Grahan 2023: ఈ నెల 28న మేషరాశిలో సంభవించబోయే చంద్ర గ్రహణం వల్ల ఏ రాశులవారికైనా పెద్దగా నష్టం కలిగే అవకాశం లేదు. చంద్రుడితో గురు గ్రహం కలిసి ఉండడం, తులా రాశిలో ఉన్న రవితో బుధుడు కలిసి ఉండడం వల్ల ఈ గ్రహణ దుష్ప్రభావం బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రవి, చంద్రులు ఒంటరిగా ఉన్నప్పుడు గ్రహణం పట్టడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే, రవితో బుధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడడం, చంద్రుడితో గురువు కలవడం వల్ల గజకేసరి ఏర్పడడం వల్ల గ్రహణానికి సంబంధించిన దుష్ఫలితాలు బాగా తగ్గిపోవడం జరుగుతుంది. సాధారణంగా చంద్ర గ్రహణం కారణం మానసిక అలజడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికీ ఆందోళన చెందడం, మనసు నిలకడగా, స్థిరంగా ఉండకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారు మరింత బాధపడడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. చంద్ర గ్రహణ ప్రభావం ఏయే రాశుల వారికి ఏవిధంగా ఉండబోయేదీ ఇక్కడ గమనిద్దాం.
- మేషం: ఈ రాశిలో చంద్రుడితో రాహువు కలవడం, సప్తమ స్థానమైన తులా రాశిలో రవితో కేతువు కలవడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతోంది. దీని ఫలితంగా ఈ నెల 28, 29 తేదీలలో కొద్దిగా మానసిక అలజడి ఉంటుంది. అతి చిన్న సమస్యలకు సైతం ఎక్కువగా ఆందోళన చెందడం, ఒక పట్టాన ఏ నిర్ణయమూ తీసుకోలేకపోవడం జరుగుతుంది. వాస్తవానికి గ్రహణం రోజైన 28న, ఆ మర్నాడు కూడా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడం, కొత్త పనిని చేపట్టకపోవడం మంచిది.
- వృషభం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో చంద్ర గ్రహణం పడుతున్నందువల్ల, స్వల్ప అనారోగ్యాలకు అవ కాశం ఉంది. అనుకోకుండా వైద్య ఖర్చులు పెరగవచ్చు. అనవసర ప్రయాణాలు చేయడం జరుగు తుంది. బంధుమిత్రుల కారణంగా బాగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నమ్మినవారు మోసగించే అవకాశం ఉంటుంది. ప్రతి పనికీ తిప్పట, శ్రమ తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహా రాలు ఒకపట్టాన ముందుకు వెళ్లకపోవచ్చు. బాగా సన్నిహితులతో అపార్థాలు తలెత్తవచ్చు.
- మిథునం: ఈ రాశికి లాభస్థానంలో చంద్ర గ్రహణం ఏర్పడడం వల్ల ఉపయోగమే తప్ప నష్టమేమీ లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు యథా ప్రకారం కొనసాగుతాయి. ముఖ్యమైన వ్యవహా రాలు యథావిధిగా పూర్తవుతాయి. అయితే, ఎక్కడా సంతకాలు చేయకపోవడం మంచిది. పెళ్లి విషయంలో ఎవరితోనూ చర్చలు జరపకపోవడం శ్రేయస్కరం. కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు.
- కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడికి గ్రహణం పట్టడం, ఈ గ్రహణం కూడా దశమ స్థానంలో ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గే సూచనలున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడం, ఉద్యోగం ఉంటుందా, పోతుందా అన్న పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. నిరుద్యోగులు చంద్ర గ్రహణం రోజున ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. కొత్తగా నిర్ణయాలు తీసుకోక పోవడం, కొత్త పనులు చేపట్టకపోవడం చాలా ఉత్తమం. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం శ్రేయస్కరం.
- సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహణం పట్టడం వల్ల పెద్దగా నష్టమేమీ లేదు. గ్రహణం పట్టిన చంద్రు డితో గురు గ్రహం కలిసి ఉన్నందువల్ల దుష్ఫలితాలు ఉండకపోవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. విదే శాలలోని బంధువులు, స్నేహితులు, పిల్లల నుంచి మంచి విశేషాలు చెవిన పడతాయి. ముఖ్య మైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఓ ఆస్తి వివాదం తేలికగా పరిష్కారం అవు తుంది.
- కన్య: ఈ రాశివారికి అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల సంసార సంబంధమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం పట్టుకునే ప్రమా దం ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేత్ర సంబంధమైన సమ స్యలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మిత్రుల వల్ల భారీగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు.
- తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడినందువల్ల, అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవ హరించడం మంచిది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పనులు చేపట్టడానికి ఇది అనుకూల సమయం కాదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శుభకార్యాలు తలపెట్టవద్దు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. సతీమణికి యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒదిగి ఉండడం మంచిది.
- వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గ్రహణం పడుతున్నందు వల్ల బాగా డబ్బు నష్టమయ్యే ప్రమాదం ఉంది. స్వల్ప అనారోగ్య సూచన లున్నాయి. అయితే, శత్రువులు, పోటీదార్ల బెడద చాలావరకు తగ్గుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో చిన్నపాటి అధికార యోగం పట్టే అవకాశం కనిపిస్తోంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఎక్కడా, ఎవరికీ సంతకాలు చేయ వద్దు.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహణం చోటు చేసుకుంటున్నందువల్ల కొత్త నిర్ణయాలు తీసుకో వడం, కొత్త పనులు చేపట్టడం మంచిది కాదు. పిల్లల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇత రుల పనుల మీద కాకుండా సొంత పనుల మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. బాగా సన్నిహి తులు లేదా దగ్గరి బంధువులు మోసం చేయడం గానీ, ఇబ్బందుల్లోకి నెట్టడం గానీ జరుగు తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
- మకరం: ఈ రాశికి నాలుగవ స్థానంలో చంద్ర గ్రహణం చోటు చేసుకోవడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోయే అవకాశం ఉంటుంది కానీ, కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తవచ్చు. మానసికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. సతీమణికి స్వల్పంగా అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. కొత్త పనులు చేపట్టకపోవడం శ్రేయస్కరం. ప్రయాణాలు వాయిదా వేయాల్సిన అవసరం ఉంది. ఆవేశకావేషాలకు లోను కాకుండా ఎంత నిబ్బరంగా ఉంటే అంత మంచిది.
- కుంభం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో చంద్ర గ్రహణం ఏర్పడడం ఒక విధంగా యోగదాయకమే అవు తుంది. కొత్త పనులు, ప్రయత్నాలు చేపట్టకపోవడం చాలా మంచిది. ఇతరత్రా రోజంతా సానుకూ లంగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. తల్లితండ్రుల నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభిస్తుంది. ఆదాయంలో అప్రయ త్నంగా వృద్ధి ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్నా చితకా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
- మీనం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో, అంటే, ధన, కుటుంబ స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల ధన, కుటుంబ సంబంధమైన కొత్త ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. ఇదివరకు చేసిన ఆర్థిక ప్రయత్నాలు ఇప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి. అదే విధంగా ఇది వరకటి ప్రయత్నాలు ఫలించి కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిపాటి మానసిక ఆందోళన ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు.
ముఖ్యమైన పరిహారాలు
మేషం, కర్కాటకం, కన్య, తులా రాశులవారు వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం, కొత్త పనులను ప్రారంభించక పోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం శ్రేయస్కరం. ఏ రాశివారైనప్పటికీ ఎక్కువగా ఆధ్యా త్మిక చింతనకు, ధ్యానానికి సమయం వెచ్చించడం మంచిది. గ్రహణ సమయంలోనే కాకుండా, గ్రహణం సంభవించిన రోజంతా రోటీన్ కు భిన్నంగా వ్యవహరించకపోవడం మంచిది. ఇష్టదైవాన్ని తరచూ ప్రార్థించడం, మంత్ర జపం కొనసాగించడం, సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా లేదా లలితా సహస్ర నామం పఠించడం వల్ల గ్రహణ దోషం అంటదు.



