Horoscope Today: వారికి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దినఫలాలు (అక్టోబర్ 28, 2023): మేష రాశి వారు శనివారంనాడు చేపట్టే ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృషభ రాశి వారు వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దినఫలాలు (అక్టోబర్ 28, 2023): మేష రాశి వారు శనివారంనాడు చేపట్టే ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృషభ రాశి వారు వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, రాశిలో గురువు, సప్తమంలో బుధుడు, పంచమంలో శుక్రుడు ఉండడం అనేది పెద్ద ఆస్తి అని చెప్పవచ్చు. ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఇది వర్తిస్తుంది. చేపట్టిన ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబపరంగా, సంతానపరంగా శుభ ఫలితాలు అను భవానికి వస్తాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
దశమ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థ స్థానంలో శుక్రుడు జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోయేటట్టు చేస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయా ణాలు లాభిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
లాభ స్థానంలో ఉన్న గురువు, పంచమ స్థానంలో బుధ, రవులు ఆదాయం పెరుగుదలకు సంబంధించిన ప్రయత్నాలను సఫలం చేస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవు తాయి. మూడవ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో ఉన్న రాహువు, భాగ్య స్థానంలో ఉన్న శనీశ్వ రుడి వల్ల శత్రు, రోగ, రుణ బాధలు తగ్గుతాయి. మనసులోని కోరికలు క్రమంగా నెరవేరుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
దశమ స్థానంలో ఉన్న గురుడు, ధన స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల పని భారం, బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు నిల కడగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు, పురోగతి లభిస్తాయి. శని, కుజ, రవి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల అలసట, శ్రమ తప్పక పోవచ్చు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఈ రాశిలో ఉన్న శుక్రుడు, సప్తమ స్థానంలో దిగ్బలంతో ఉన్న శనీశ్వరుడు, తృతీయ స్థానంలో ఉన్న కుజుడి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. భాగ్య స్థానంలో గురువు వల్ల ఆదాయంలో పెరుగుదలే తప్ప తగ్గుదల ఉండదు. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అనవసర పరిచయాలకు, అనవసర ఖర్చులకు, మితిమీరిన సహాయాలకు దూరంగా ఉండడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆరవ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో కుజ, రవి, బుధ గ్రహాల సంచారం కారణంగా వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు నిలకడగా ఉండడం, ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తి కావడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యయంలో శుక్రుడి సంచారం వల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
పంచమంలో శని, సప్తమంలో గురువు, లాభ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ఆర్థిక వ్యవ హారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రయో జనం పొందుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సతీమణితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గురువు కారణంగా అనేక చిక్కులు, సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
దశమ స్థానంలో ఉన్న శుక్రుడి కారణంగా వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. చతుర్థంలో ఉన్నశనీశ్వరుడి కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండడం, స్వల్ప అనారో గ్యాలకు అవకాశం ఉండడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో సామరస్యం, దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడతాయి. బంధుమిత్రుల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో బాగా కలిసి వస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయంలో శనీశ్వరుడు, పంచమంలో గురువు, భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో మంచి యోగం పట్టే అవకాశం ఉంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవు తాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లి వైపు నుంచి కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన స్థానంలో శనీశ్వరుడు, దశమ స్థానంలో కుజ, బుధ, రవి గ్రహాల వల్ల వృత్తి, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి కలిసి వస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సప్తమ స్థానంలో శుక్ర సంచారం బాగా అనుకూలంగా ఉంది. భాగ్య స్థానంలో రవి, బుధ, కుజ సంచారం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు, జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల అధిక ప్రయోజనం ఉండకపోవచ్చు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ధన స్థానంలో రాశ్యధిపతి గురువు ఉండడం వల్ల ఆదాయం పెరగడం, సంపద కలిసి రావడం, ఆస్తి విలువ అధికం కావడం వంటివి జరుగుతాయి. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. రాజకీ యాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో అభివృద్ధి చెందుతారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఎటువంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాలనిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడ తారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.