Shukra Gochar 2023: కన్యా రాశిలోకి శుక్ర గ్రహం సంచారం.. ఆ రాశుల వారికి సానుకూల ఫలితాలు..
నవంబర్ 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శుక్ర గ్రహం కన్యారాశిలో నీచ స్థితికి చేరుతోంది. సుఖ సంతోషాలకు, శృంగారానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, కళలకు కారకుడైన శుక్రుడు నీచబడడం వల్ల ఈ కారకత్వాలకు ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడతాయి. దాదాపు ప్రతి రాశివారికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో ఈ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉండే పక్షంలో ఇటువంటి ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు.
నవంబర్ 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శుక్ర గ్రహం కన్యారాశిలో నీచ స్థితికి చేరుతోంది. సుఖ సంతోషాలకు, శృంగారానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, కళలకు కారకుడైన శుక్రుడు నీచబడడం వల్ల ఈ కారకత్వాలకు ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడతాయి. దాదాపు ప్రతి రాశివారికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో ఈ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉండే పక్షంలో ఇటువంటి ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. జాతక చక్రంలో శుక్రుడు దుస్థానాల్లో ఉన్నా, బలహీనంగా ఉన్నా ఈ లక్షణాలన్నీ మరింత బలంగా పనిచేసే అవ కాశం ఉంటుంది. శుక్ర గ్రహ నీచత్వం వివిధ రాశులవారికి ఏ విధంగా ఉండబోతున్నదీ పరిశీలిద్దాం.
మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శుక్రుడు నీచబడడం వల్ల సతీమణితో కొద్దిగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఊహించని విధంగా కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. తొందరపడి మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకునే సూచనలున్నాయి. ఇతరులకు డబ్బు ఇచ్చి మోస పోవడం జరుగుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే పక్షంలో అది తిరిగి రాకపోవచ్చు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలూ పెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా సంతృప్తి కలిగించకపోవచ్చు.
వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు నీచబడడం వల్ల స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంటుంది. శారీరక, మానసిక బలహీనతలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కాస్తంత ఒదిగి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. బంధువులకు సంబంధించి దుర్వార్తలు వింటారు. శత్రువులు, పోటీదార్లు పెరుగు తారు. అయితే, సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగానే సాగిపోతాయి.
మిథునం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో శుక్రుడు నీచబడడం వల్ల సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. దాంపత్య సమస్యలు తలెత్తుతాయి. సతీమణితో తరచూ వాగ్వాదాలు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో ప్రశాంతత కరువవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గవచ్చు. అయితే, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖర్చులు బాగా తగ్గించుకుం టారు. ఇంటిలో మరమ్మతులు చేపట్టడం, ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకోవడం జరుగు తుంది.
కర్కాటకం: ఈ రాశికి మూడవ స్థానంలో శుక్ర గ్రహం నీచబడడం వల్ల ఆదాయం పెరుగుదలకు ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది కానీ, అది ఆశించినం తగా సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. అనవసర పరిచయాలు, అక్రమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.
సింహం: ఈ రాశివారికి ధన, కుటుంబ స్థానంలో శుక్రుడు నీచబడుతున్నందువల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా అందాల్సిన ప్రతిఫలాలు, పారితోషికాలు ఒకపట్టాన అందకపోవచ్చు. రావలసిన డబ్బు అందక కొద్దిగా ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. తొందరపాటుగా మాట్లాడడం, తొందర పాటుతో నిర్ణయాలు తీసుకోవడం వంటివి జరగవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసు కుంటాయి.
కన్య: ఈ రాశిలో శుక్రుడు నీచబడుతున్నందువల్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందకపోవచ్చు. వృత్తి, ఉద్యో గాల్లో అధికారులు గరిష్టంగా పని చేయించుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఇంటా బయటా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. ఆర్థిక సంబంధమైన వాగ్దానాలు, హామీలు నిలుపుకోవడం కష్టమవుతుంది. అప్రమత్తంగా ఉండని పక్షంలో ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు రోటీన్ గా సాగిపోతాయి.
తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు వ్యయ స్థానంలో నీచబడడం వల్ల స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరగవచ్చు. ఇతరులు మోసగించవచ్చు. డబ్బు నష్టమయ్యే అవ కాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలాసాల మీద ఖర్చు పెరుగు తుంది. అనవసర పరిచయాలకు, అక్రమ సంబంధాలకు అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కొందరు దూరమయ్యే సూచనలున్నాయి. ప్రేమ భాగస్వామికి భారీగా కానుకలు కొనిచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం: ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్రుడు నీచత్వం పొందుతున్నందువల్ల ఆదాయంలో పెరుగుదల ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా యథాతథ స్థితి కొనసాగుతుంది. పెళ్లి సంబం ధాలు చివరి దాకా వచ్చి వాయిదా పడతాయి. కుటుంబ వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సతీమణితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు అసంతృప్తిని మిగలుస్తాయి.
ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్రుడు బలహీనపడడంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరగడం, ప్రతిఫలం తగ్గడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం తగ్గుతుంది. అధికారులతో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. కొత్త ఉద్యోగాలు ఆశాజనకంగా, సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. శత్రువులు, పోటీదార్లు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి.
మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి నీచత్వం వల్ల పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి శుభవార్త వినడం జరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు పెరిగే సూచనలున్నాయి. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి.
కుంభం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో శుక్రుడు నీచపడడం కాస్తంత ఇబ్బంది కలిగించే విషయమే అవు తుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సతీమణి అనారోగ్యానికి గురయ్యే సూచనలున్నాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక అవస్థలు పడడం జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత తగ్గే అవకాశం కూడా ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు నీచబడడం వల్ల సతీమణికి స్వల్ప అనారోగ్యం చేయడానికి, సతీమణి దూర ప్రాంతానికి బదిలీ కావడానికి అవకాశం ఉంది. మొత్తం మీద దాంపత్య జీవితం ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నా లను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.