Chandra Grahanam: జాతకంలో చంద్ర, శని దోషాలు ఉన్నవారు గ్రహణ సమయంలో చేయాల్సిన పరిహారాలు.. ఏమిటంటే..

చంద్రగ్రహణం అక్టోబర్ 28-29 అర్ధరాత్రి ఉదయం 01:06 గంటలకు ప్రారంభమై 02:22 గంటలకు ముగుస్తుంది. అయితే గ్రహణ సూతక కాలం 9 గంటల ముందు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణ మొత్తం వ్యవధి 01 గంట 16 నిమిషాల 16 సెకన్లు. ఈ గ్రహణానికి సంబంధించిన విశేషాలను వివరంగా తెలుసుకుందాం.

Chandra Grahanam: జాతకంలో చంద్ర, శని దోషాలు ఉన్నవారు గ్రహణ సమయంలో చేయాల్సిన పరిహారాలు.. ఏమిటంటే..
Chandra Grahanam
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2023 | 5:23 PM

హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజు రాత్రి ఏర్పడనున్న చంద్ర గ్రహణం ఈ సంవత్సరంలో రెండవ, చివరి గ్రహణం అవుతుంది. పంచాంగం ప్రకారం రాహుస్త చంద్ర గ్రహణం అవుతుంది. ఈ చంద్రగ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది. అయినప్పటికీ మనదేశంలో ఈ గ్రహణ ప్రభావం పడనుంది. దీంతో గ్రహణానికి  సంబంధించిన అన్ని నియమాలు వర్తిస్తాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీ సమయం ఆధారంగా పంచాంగం  ప్రకారం, చంద్రగ్రహణం అక్టోబర్ 28-29 అర్ధరాత్రి ఉదయం 01:06 గంటలకు ప్రారంభమై 02:22 గంటలకు ముగుస్తుంది. అయితే గ్రహణ సూతక కాలం 9 గంటల ముందు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణ మొత్తం వ్యవధి 01 గంట 16 నిమిషాల 16 సెకన్లు. ఈ గ్రహణానికి సంబంధించిన విశేషాలను వివరంగా తెలుసుకుందాం.

చంద్ర గ్రహణ సమయంలో చేయాల్సిన నివారణలు

  1. హిందూ విశ్వాసం ప్రకారం చంద్రగ్రహణం రోజున దేవీ దేవతల విగ్రహాలను తాకడం లేదా పూజించడం నిషేధం. గ్రహణ సమయం సాధకులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మంత్రాన్ని పఠించడం ద్వారా నిర్దిష్ట కోరికను నెరవేర్చుకోవాలనుకుంటే చంద్రగ్రహణం రోజున పూర్తి ఆచారాలతో జపించాలి.
  2. ఎవరి జాతకంలో చంద్ర దోషం ఉన్నా, చంద్రుడు బలహీనంగా ఉన్నా చంద్రగ్రహణం రోజున కంచు పాత్రలో పాలు పోసి అందులో ముఖం చూసి ఏదైనా శివాలయానికి వెళ్లి ఆ పాలను శివలింగానికి సమర్పించాలి. . చంద్ర దోషం తొలగడానికి రుద్రాక్ష జపమాలతో చంద్రుని మంత్రాన్ని కూడా జపించవచ్చు.
  3. ఈ సంవత్సరం చంద్రగ్రహణం శనివారం ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో శనికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే సూతక కాలం మొదలు కావడానికి ముందు ఆవాల నూనెతో పాత్రను నింపి, అందులో మీ ముఖాన్ని చూసి శనిదేవుడికి సమర్పించండి. దీంతో శనిగ్రహానికి సంబంధించిన కష్టాలు త్వరలో తొలగిపోతాయి.
  4. చంద్రగ్రహణం ప్రభావాలను నివారించడానికి, తీర్థయాత్రలు, స్నానం , దానం చేయాలని శాస్త్రాలలో సూచించబడింది. అటువంటి పరిస్థితిలో చంద్రగ్రహణం తర్వాత వీలైతే, గంగలో స్నానం చేసి, అవసరమైన వ్యక్తికి ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయండి.
  5. ఇవి కూడా చదవండి

చంద్రగ్రహణం సమయంలో చేయకూడని పనులు

  1. హిందూ విశ్వాసం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో దేవాలయాలు లేదా దేవుళ్ళ , దేవతల విగ్రహాలను తాకవద్దు
  2. చంద్రగ్రహణం సమయంలో ఆహారాన్ని వండటం, జుట్టు , గోర్లు కత్తిరించడం మొదలైనవి కూడా చేయవద్దు
  3. హిందువుల విశ్వాసం ప్రకారం చంద్రగ్రహణాన్ని పొరపాటున కూడా చూడవద్దని నమ్మకం. చంద్రుడిని ఏర్పడిన కష్టం చూడటం మంచిది కాదని విశ్వాసం. గ్రహణ కాలంలో బయట తిరగరాదు.
  4. అయితే కొన్ని సార్లు వాతావరణం కారణంగా చంద్రుడు మేఘాలతో కప్పబడి.. గ్రహణం కనిపించనప్పటికీ సూతకం పాటించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.