Chandra Grahan 2023: రాత్రి చంద్రగ్రహణం సమయంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే కష్టాలు తప్పవు..

సూతక కాలం ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. హిందూ మతంలో చంద్రగ్రహణం అశుభకరమైన సంఘటనగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ఎటువంటి శుభ కార్యాలు, పూజలను చేయరు. గ్రంథాల్లో గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని పేర్కొన్నారు. ఈ రోజు మనం గ్రహణ సమయంలో ఏ తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం..

Chandra Grahan 2023: రాత్రి చంద్రగ్రహణం సమయంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే కష్టాలు తప్పవు..
Chandra Grahan 2023
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2023 | 3:09 PM

ఈ సంవత్సరంలో చివరి, రెండవ చంద్రగ్రహణం ఈరోజు అంటే 28 అక్టోబర్ 2023న సంభవించబోతోంది. శరత్ పూర్ణిమ రోజున సంభవించే ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలలో కనిపిస్తుంది.  హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి 01:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుందని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో సూతక కాలం ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. హిందూ మతంలో చంద్రగ్రహణం అశుభకరమైన సంఘటనగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ఎటువంటి శుభ కార్యాలు, పూజలను చేయరు. గ్రంథాల్లో గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని పేర్కొన్నారు. ఈ రోజు మనం గ్రహణ సమయంలో ఏ తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

పూజలు చేయడం నిషేధం

చంద్రగ్రహణ సమయంలో దేవతల విగ్రహాలను లేదా దేవుని ఆలయాలను తాకడం నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల దేవతలకు కోపం వస్తుందని విశ్వాసం. అయితే ఈ సమయంలో మీరు మీ మనస్సులో భగవంతుని స్మరించుకోవచ్చు. మీ మనస్సులో మంత్రాలను కూడా జపించవచ్చు.

గోర్లు, జుట్టు కత్తిరించవద్దు

హిందువుల నమ్మకం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. అంతే కాకుండా బట్టలు కుట్టడం, బట్టలు నేయడం మొదలైన పనులు చేయడం కూడా నిషేధం

ఇవి కూడా చదవండి

గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హిందూ మత గ్రంధాల్లో చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రహణ సమయంలో వెలువడే కిరణాలు కడుపులో పెరుగుతున్న శిశువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు.

వండిన ఆహారాన్ని తీసుకోవద్దు

గ్రహణం సమయంలో వంటగదిలో వండిన ఆహారం మిగిలి ఉంటే, దానిని తినకూడదు. ఇలా వండిన ఆహారాన్ని పారేసే బదులు ఆవు, కుక్క లేదా మరేదైనా జంతువుకు తినిపిస్తే మంచిది.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు. అందువల్ల..  ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!