AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామపండు Vs అరటి పండు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది..? పవర్‌ఫుల్ ఎనర్జీ కావాలంటే..

Guava Vs Banana: మన శరీరానికి పండ్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ముఖ్యంగా రాత్రంతా ఖాళీ కడుపుతో ఉన్న శరీరానికి ఉదయాన్నే పండ్లు అందిస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అయితే అల్పాహారంలో జామపండు తీసుకోవాలా లేక అరటిపండు తీసుకోవాలా అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. ఈ రెండింటిలో ఉండే పోషక రహస్యాలు, మీ శరీర తత్వానికి ఏది సెట్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Mar 11, 2026 | 6:50 AM

Share
జామపండు: జామపండును పోషకాల పవర్‌హౌస్ అని అంటారు. ఇందులో ఉండే విటమిన్ సి పరిమాణం నారింజ పండు కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కేవలం 100 గ్రాముల జామలో 228 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది.

1 / 5
జామపండులో తక్కువ కేలరీలు, అధిక పీచు పదార్థం ఉండటం వల్ల, బరువు తగ్గాలనుకునే వారికి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

2 / 5
అరటిపండు: అరటిపండు తక్షణ శక్తిని ఇచ్చే ఎనర్జీ బాంబ్ లాంటిది. ఉదయాన్నే వ్యాయామం లేదా జిమ్ చేసేవారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి వేగంగా శక్తిని అందిస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇందులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తూ.. రోజంతా మన మూడ్‌ని ఉత్సాహంగా, ఒత్తిడి లేకుండా ఉంచడానికి దోహదపడుతుంది.

3 / 5
ఏది ఎంచుకోవాలి? ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి అంటే అది పూర్తిగా మీ ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు షుగర్ లేదా బరువు తగ్గడం వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లయితే జామపండు ఉత్తమమైనది. అలా కాకుండా రోజంతా శారీరక శ్రమ చేసేవారు లేదా తక్షణమే అలసట నుండి ఉపశమనం పొందాలనుకునే వారు అరటిపండును ఎంచుకోవడం మంచిది. వాస్తవానికి శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలంటే ఒకరోజు జామ, మరొకరోజు అరటిపండు మార్చి మార్చి తీసుకోవడం అత్యుత్తమమైన పద్ధతి.

4 / 5
ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. పండ్లు మరీ పుల్లగా లేకుండా చూసుకోవాలి, లేదంటే ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు అరటిపండు తీసుకునేటప్పుడు పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ జీవనశైలికి, శరీర తత్వానికి తగ్గట్టుగా సరైన పండును ఎంచుకుని మీ రోజును ఆరోగ్యంగా ప్రారంభించండి.

5 / 5
Follow Us