Team India: వీళ్లే ఇంత డేంజరస్‌గా ఉంటే.. ఇక టీమిండియాలోకి వాడు ఎంట్రీ ఇస్తే.. మిగతా జట్లన్నీ వాకౌటే..!
Shaun Pollock Comments on Team India Batting Dominance: టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. ఇది జట్టు సమష్టి కృషికి నిదర్శనం. భారత బ్యాటింగ్ లైనప్ అసాధారణమైనదని, రాబోయే ఐదేళ్ల పాటు భారత్‌ను ఓడించడం ప్రత్యర్థి జట్లకు కష్టమని దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పోలక్ అభిప్రాయపడ్డారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశి వంటి వారు టీంలో చేరితే ఈ ఆధిపత్యం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Shaun Pollock Predicts Five Years of Cricket Supremacy: టీమిండియా(Indian Cricket Team) ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. స్వదేశంలో సొంత ప్రేక్షకుల ముందు సగర్వంగా 2026 టీ20 ప్రపంచకప్ (Team India T20 World Cup 2026)ను కైవసం చేసుకుంది. ఇది వరుసగా భారత్ గెలిచిన రెండో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు, ఏ ఒక్కరో ఇద్దరు ఆటగాళ్ళపై ఆధారపడకుండా, జట్టు మొత్తం రాణించడంతో విజయం సాధ్యమైంది. జట్టులోని 11 మంది ఆటగాళ్ళు హీరోలేనని ఈ విజయం నిరూపించింది. నిజమైన టీం స్పిరిట్‌కు ఈ వరల్డ్ కప్ విజయం నిలువుటద్దంగా నిలిచింది.
దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ ఐసీసీ మెగా టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొన్నాయి. అయితే ఏ జట్టు కూడా భారత తరహాలో రాణించలేకపోయింది. టీమిండియా మొత్తం మ్యాచ్ విన్నర్లతో నిండిపోయింది. ఒకరి తర్వాత ఒకరు అద్భుతాలు చేశారు. క్షణాల్లో ఆట గమనాన్ని మార్చి సత్తా చాటారు. టోర్నీకి ముందు భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా, గెలుపు అంత సులువుగా రాలేదు. ఆరంభంలో కొన్ని తడబాట్లు, సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్నప్పుడు భారత్ అందరూ ఊహించిన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సూపర్ ఎయిట్, సెమీఫైనల్, ఫైనల్‌లలో ప్రత్యర్థులను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ చిత్తు చేసింది. గత 18 నెలలుగా పరిణతి చెందిన తమ బ్యాటింగ్ లైనప్ పవర్‌ను ప్రపంచానికి చూపించింది.
ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!
ఈ టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను చూసి ప్రపంచ మేటి జట్లన్నీ నెవ్వెరపోయాయి. అలాంటి బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న టీమిండియాపై గెలవడం కష్టమే అంటూ వ్యాఖ్యానించాయి. అయితే టోర్నమెంట్ ఆరంభంలో టీమిండియా బ్యాటింగ్ అంతగా రాణించలేకపోయింది. కానీ సూపర్ ఎయిట్‌లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిన తర్వాత, జింబాబ్వే, వెస్ట్ ఇండీస్, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్, ఫైనల్‌లో న్యూజిలాండ్‌లపై చెలరేగిపోయారు.
దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పోలక్ (Shaun Pollock) మాట్లాడుతూ, ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను, ముఖ్యంగా ఇంత స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్న టీమిండియాపై ఏ జట్టైనా గెలవడం అసాధ్యమని అన్నాడు. ప్రస్తుత ప్రపంచ జట్లలోని అన్ని జట్ల కంటే టీమిండియా బ్యాటింగ్ విభాగం చాలా దుర్భేద్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. టీమిండియా బ్యాటర్లను ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చెలరేగిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టాప్ నుంచి బాటమ్ వరకు ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్లు ఏకంగా 200కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాట్లను ఝులిపిస్తున్నారని, ఇలాంటి బ్యాటింగ్ లైనప్‌తో ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం ఏ బౌలర్‌కైనా కష్టమేనని పోలక్ తెలిపారు.
ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!
ఇది చాలదన్నట్టుగా ఇంకా టీమిండియాలోకి కొత్త ఆటగాళ్లు, భీకర హిట్టర్లతో టీంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశి (Vaibhav Suryavanshi) టీమిండియా జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో అలాగే ఐపీఎల్‌లో దుమ్ము రేపుతున్న వైభవ్ సూర్యవంశి టీమిండియాలో చేరితే మాత్రం, ఇంకా భీకరమైన బ్యాటింగ్ లైనప్‌తో కూడిన టీమిండియాను ప్రత్యర్థి జట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని షాన్ పోలక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత టీమిండియాను చూస్తుంటే మరో ఐదేళ్ల పాటు టీమిండియాను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు కష్టమేనని షాన్ పోలక్ పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



