AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prize Money: టీమిండియాకు రూ.131 కోట్ల ప్రైజ్ మనీ.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లు దక్కనున్నాయంటే?

Team India Prize Money Distribution Report: టీ20 వరల్డ్ కప్ 2026లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. మొత్తం రూ.131 కోట్ల రివార్డ్‌ను ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ మధ్య ఎలా పంచుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా నివేదికల ప్రకారం ఈ మొత్తంలో పెద్ద భాగం ఆటగాళ్లకే దక్కనుంది.

Prize Money: టీమిండియాకు రూ.131 కోట్ల ప్రైజ్ మనీ.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లు దక్కనున్నాయంటే?
Team India 131 Crore Prize Money
Venkata Chari
|

Updated on: Mar 11, 2026 | 7:06 AM

Share

Team India Prize Money Distribution Report: బీసీసీఐ (Board of Control for Cricket in India) (BCCI) టీ20 వరల్డ్ కప్ 2026 విజయం అనంతరం భారత జట్టుకు రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్‌లో భారత జట్టు (India national cricket team), న్యూజిలాండ్ జట్టు (New Zealand) ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడోసారి టైటిల్ గెలుచుకుంది. ఇది బీసీసీఐ ప్రకటించిన అతిపెద్ద బహుమతుల్లో ఒకటిగా నిలిచింది. 2024 టీ20 వరల్డ్ కప్ విజేతలకు ఇచ్చిన రూ.125 కోట్ల రికార్డును ఈసారి బీసీసీఐ అధిగమించింది.

బహుమతి ఎలా పంచుకుంటారు?

సమాచారం ప్రకారం ఈ రూ.131 కోట్ల మొత్తం 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ మధ్య పంచనున్నారు. అయితే బీసీసీఐ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ పీటీఐ నివేదిక ప్రకారం ఈ మొత్తంలో ఎక్కువ భాగం ఆటగాళ్లకే దక్కే అవకాశం ఉంది. కోచింగ్ స్టాఫ్, ఫిజియో, ట్రైనర్లు, ఇతర సపోర్ట్ సిబ్బందికి వారి హోదా ప్రకారం నగదు బహుమతి ఇవ్వబడుతుంది.

ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలో ఘన విజయం..

ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నేతృత్వంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం టోర్నమెంట్‌లో భారత్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడింది. ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్ నమోదు చేసి కివీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాక స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి దేశంగా కూడా చరిత్ర సృష్టించింది.

ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

ఐసీసీ నుంచి కూడా భారీ ప్రైజ్ మనీ..

బీసీసీఐ బహుమతితో పాటు ఐసీసీ (International Cricket Council) (ICC) కూడా విజేతలకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఫైనల్‌లో విజయం సాధించిన భారత్‌కు 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.21.5 కోట్లు) బహుమతిగా లభించాయి. ఫైనల్‌లో ఓడిన న్యూజిలాండ్‌కు 1.17 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10.75 కోట్లు) రన్నరప్ బహుమతిగా ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.131 కోట్ల ప్రైజ్ మనీలో ఒక్కొక్క ఆటగాడికి ఎంత దక్కనుందంటే?
రూ.131 కోట్ల ప్రైజ్ మనీలో ఒక్కొక్క ఆటగాడికి ఎంత దక్కనుందంటే?
వార్‌ ఎఫెక్ట్‌.. వీటి ధరలు భారీగా పెంపు!
వార్‌ ఎఫెక్ట్‌.. వీటి ధరలు భారీగా పెంపు!
రంగంలోకి దిగిన రిలయన్స్‌.. ఎల్‌పీజీ ఉత్పత్తిపై కీలక ప్రకటన
రంగంలోకి దిగిన రిలయన్స్‌.. ఎల్‌పీజీ ఉత్పత్తిపై కీలక ప్రకటన
10 రోజులకే 51 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న చిన్ని సినిమా
10 రోజులకే 51 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న చిన్ని సినిమా
బుధాష్టమి.. విష్ణువుని శివుడు ఆరాధించిన రోజు.. అపార పుణ్యఫలం..
బుధాష్టమి.. విష్ణువుని శివుడు ఆరాధించిన రోజు.. అపార పుణ్యఫలం..
స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ రాత పరీక్షల 2026 తేదీలు విడుదల
స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ రాత పరీక్షల 2026 తేదీలు విడుదల
జామపండు Vs అరటి పండు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది..?
జామపండు Vs అరటి పండు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది..?
వామ్మో.. ఇలాంటి ఛార్జర్లు వాడితే సిమ్‌ కార్డు దెబ్బతింటుందట..
వామ్మో.. ఇలాంటి ఛార్జర్లు వాడితే సిమ్‌ కార్డు దెబ్బతింటుందట..
మరో 2 రోజుల్లో RRB NTPC అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
మరో 2 రోజుల్లో RRB NTPC అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
ఎల్‌పీజీ నిల్వలపై కేంద్రం క్లారిటీ.. అమల్లోకి కీలక చట్టం!
ఎల్‌పీజీ నిల్వలపై కేంద్రం క్లారిటీ.. అమల్లోకి కీలక చట్టం!