UP Police Retirement: 50 ఏళ్లు పైబడిన పోలీసులకు పదవీ విరమణ..! సర్కార్‌ ఉత్తర్వులు జారీ..

సంబంధిత పోలీస్‌ అధికారులు, లేదా కానిస్టెబుల్స్‌కు సంబంధించి ఫిజికల్ ఫిట్ నెస్ కంటే కూడా అవినీతి, ట్రాక్ రికార్డ్ కే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. సర్వీసులో అవినీతికి పాల్పడినట్లు తేలినా, లేదంటే చెడు ప్రవర్తన కలిగి ఉన్నట్లు తేలితే.. అలాంటి వారికి వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఈ విషయంలో ఏడీజీ ఎస్టాబ్లిష్‌మెంట్ అటువంటి పోలీసుల ట్రాక్ రికార్డ్‌ను సమర్పించాలని కోరింది. ఆ రిపోర్ట్‌ ఆధారంగా సంబంధిత వ్యక్తులపై నిర్ణయం తీసుకోనున్నారు.

UP Police Retirement: 50 ఏళ్లు పైబడిన పోలీసులకు పదవీ విరమణ..! సర్కార్‌ ఉత్తర్వులు జారీ..
Up Police Retirement
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2023 | 5:09 PM

పోలీస్‌ శాఖలో 50 ఏళ్లు పైబడిన వారిని పదవీ విరమణ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్బంధ పదవీ విరమణకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఈ మేరకు 50ఏళ్లు పైబడిన పోలీసుల జాబితాను తయారు చేయాలని ఏడీజీ ఎస్టాబ్లిష్‌మెంట్ అన్ని పోలీసు విభాగాలు, కమిషనర్‌లను ఆదేశించింది. ఇందులో భాగంగా పోలీసుల పని సామర్థ్యం, ​​అవినీతి మొదలైన అనేక ప్రమాణాలను పరిశీలనలోకి తీసుకోనున్నారు. నవంబర్ 30 నాటికి అధికారులందరూ 50 ఏళ్లు పైబడిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించి వారి పదవీ విరమణపై నిర్ణయం తీసుకుంటారు. ఉన్నతాధికారులు మొదలు.. కానిస్టేబుళ్ల వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఇది ఎక్కడో కాదు.. యూపీలోని యోగి సర్కార్‌ తీసుకున్న నిర్ణయం.. పోలీస్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్క్రీనింగ్ పనులు కూడా ప్రారంభించారు.

మార్చి 30, 2023 నాటికి 50 ఏళ్లు నిండిన పోలీసు సిబ్బందికి వారి ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించిన తర్వాత తప్పనిసరి పదవీ విరమణ చేయించనున్నారు. ఈ ఆర్డర్‌ను ADG ఎస్టాబ్లిష్‌మెంట్ సంజయ్ సింఘాల్ అన్ని IG రేంజ్‌లు/ADG జోన్‌లు/మొత్తం 7 పోలీస్ కమీషనర్‌లతో పాటు అన్ని పోలీసు విభాగాలకు పంపారు. ట్రాక్ రికార్డు ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. నవంబర్ 30 నాటికి అధికారులందరూ 50 ఏళ్లు పైబడిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించి నిర్బంధ పదవీ విరమణపై నిర్ణయం తీసుకుంటారు. అలాంటి పోలీసుల జాబితాను ప్రధాన కార్యాలయానికి పంపిస్తామన్నారు. పీఏసీలో మోహరించిన పోలీసుల జాబితాను నవంబర్ 20లోగా పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

రిపోర్టింగ్ ప్రకారం, అవినీతి ఆరోపణలు కలిగిన పోలీసులపై పదవీ విరమణ వేటు వేయనున్నారు. అయితే ఇక్కడ సంబంధిత పోలీస్‌ అధికారులు, లేదా కానిస్టెబుల్స్‌కు సంబంధించి ఫిజికల్ ఫిట్ నెస్ కంటే కూడా అవినీతి, ట్రాక్ రికార్డ్ కే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. సర్వీసులో అవినీతికి పాల్పడినట్లు తేలినా, లేదంటే చెడు ప్రవర్తన కలిగి ఉన్నట్లు తేలితే.. అలాంటి వారికి వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఈ విషయంలో ఏడీజీ ఎస్టాబ్లిష్‌మెంట్ అటువంటి పోలీసుల ట్రాక్ రికార్డ్‌ను సమర్పించాలని కోరింది. ఆ రిపోర్ట్‌ ఆధారంగా సంబంధిత వ్యక్తులపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

యూపీ పోలీసుల పనితీరును మెరుగుపరచడానికి యోగి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా వందలాది మంది పోలీసులకు బలవంతంగా పదవీ విరమణ వేటు వేసింది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని అధికారులు లేదా ఉద్యోగులను తొలగిస్తామని, తెలివైన, సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తామని ఇటీవల సీఎం యోగి చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..