30అడుగుల ఎత్తైన గాజు వంతెనకు పగుళ్లు.. అద్దం పగిలి పోవటంతో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు..
ప్రసిద్ధ గాజు వంతెనపై ఇలాంటి పెను ప్రమాదం సంభవించింది. కాగా, టూర్ గైడ్‌లలో ఇద్దరు తాళ్ల సాయంతో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మిగిలిన వారు తమను తాము నియంత్రించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ దృశ్యాలు చూసేందుకు ఎంతో భయానకంగా ఉన్నాయి. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. మొదటిసారిగా ఈ వంతెన భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.

ఫ్యాన్సీ ఆర్కిటెక్చర్‌తో ఎంతో అద్భుతంగా నిర్మించిన గాజు వంతెన విరిగిపోయింది. దానిపై నడుస్తున్న ప్రజలు ఒక్కసారిగా 30 అడుగుల కింద పడిపోయారు. గ్లాస్ బ్రిడ్జ్ పై వాకింగ్ చేస్తున్న 11 మంది టూర్ గైడ్‌లు వంతెన దాటుతుండగా ఒక్కసారిగా అద్దం బ్రిడ్జి విరిగిపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అమాంతంగా 30 అడుగుల మేర కింద పడిపోయారు. అంత ఎత్తు నుంచి అమాంతంగా కిందపడిన వారిలో ఒకరు గాయపడగా, మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్యాన్సీ ఆర్కిటెక్చర్‌తో తయారు చేసిన ఇండోనేషియాలోని ప్రసిద్ధ గాజు వంతెనపై ఇలాంటి పెను ప్రమాదం సంభవించింది. కాగా, టూర్ గైడ్‌లలో ఇద్దరు తాళ్ల సాయంతో తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మిగిలిన వారు తమను తాము నియంత్రించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆ దృశ్యాలు చూసేందుకు ఎంతో భయానకంగా ఉన్నాయి. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. మొదటిసారిగా ఈ వంతెన భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ వంతెనను సందర్శించే చాలా మంది ఇప్పటికే సోషల్ మీడియాలో దీని భద్రత గురించి అనేక సందేహాలను లేవనెత్తుతున్నారు.
ఇండోనేషియాలో బుధవారం గాజు వంతెన పగిలిపోవడంతో ఒక పర్యాటకుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు . సెంట్రల్ జావాలోని ఒక అడవిలో 30 అడుగుల ఎత్తైన ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన జియోంగ్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్లాస్ బ్రిడ్జ్ విరిగిపోయిన సమయంలో11 మంది సందర్శకులు వాకింగ్ చేస్తున్నారు. ఒక్కసారిగా అద్దం పగిలిపోవటంతో ఇద్దరు వ్యక్తులు పక్కనే ఏదో సపోర్ట్ పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. మరో ఇద్దరు ఒక్కసారిగా నేలమీద పడిపోయారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ఈ గాజు వంతెన భద్రతా ప్రమాణాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అనేక మంది సందర్శకులు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నారు. జరిగిన విషాదంతో దేశంలోని పర్యాటక ఆకర్షణల భద్రతపై ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఫంక్షనల్ సర్టిఫికేట్‌లను పొందే వరకు గాజు వంతెనలు ఉన్న స్థలాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉంటే,ఇలాంటి గాజు వంతెనలు (స్కైవాక్ బ్రిడ్జి) విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లాస్ బ్రిడ్జిలతో పోల్చుకుంటే.. వాటంతా పెద్దది కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో కూడా ఒక గాజు వంతెన నిర్మించారు. 45 అడుగుల పొడవుతో చిన్నపాటి స్కైవాక్ బ్రిడ్జి సందర్శకులను ఆకట్టుకుంటోంది. చిన్న వాగును దాటడం కోసం మని రూ.2కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..