AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. టమాటాను ఫాలో అవుతోంది..

Andhra Pradesh: హోల్ సేల్ వ్యాపారులు ఉల్లిపాయలను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా గౌడన్ల పై మెరుపు దాడులకు దిగుతున్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర, కర్నూలు లో ఉల్లి పంట దిగుబడి తగ్గిందని, త్వరలో ఆయా చోట్ల కొత్త పంట దిగుబడి వస్తే కొంతమేర ఉల్లి ధర నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అధికారులు. ఏదేమైనా పెరిగిన ఉల్లి ధర భారం తమ పై పడకుండా చూడాలని కోరుతున్నారు వినియోగదారులు.

Onion: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. టమాటాను ఫాలో అవుతోంది..
Onion Prices In Ap
Follow us
G Koteswara Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 27, 2023 | 9:36 PM

విజయనగరం, అక్టోబర్27; సహజంగా ఉల్లి కోస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ ఇప్పుడు కొనబోతేనే కన్నీళ్లు వస్తున్నాయి. గత రెండు నెలలుగా ఉల్లి ధర రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న ఉల్లి ధరతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ధర పెరగటానికి గల కారణాలు ఏంటో స్పష్టంగా తెలియడం లేదు. మార్కెట్ లో వ్యాపారులు, దళారీల మాయజాలమా? లేక డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడమే కారణమా అన్న విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఇటీవల కాలంలో టమోటా ధర అమాంతంగా పెరిగి డబుల్ సెంచరీ దాటి వినియోగదారులు ఇబ్బంది పడినట్లే ఇప్పుడు ఉల్లి ధర పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉల్లిపాయలను అన్ని వంటకాల్లో వినియోగిస్తారు. ఉల్లి లేని వంట ఉండదనే చెప్పాలి. ఉల్లి లేని వంటకాల రుచి రుచించదనే చెప్పాలి. అలాంటి ఉల్లి ధర పెరగడం ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. కిలో ఉల్లి ఆగస్ట్ మొదటి వారంలో 15 నుండి 20 రూపాయల వరకు ఉండేది. తరువాత సెప్టెంబర్ నెల నాటికి ఆ ధర 35 నుండి 45 రూపాయల వరకు పెరిగింది. ఇప్పుడు ఆ ధర 60 నుండి 70 రూపాయకు చేరింది. ఈ ధర ఇంతటితో ఆగే అవకాశాలు లేవని మరింత పెరుగుతుందని అంటున్నారు వ్యాపారులు.

ఉల్లి ధర రోజురోజుకు పెరుగుతుండటంతో కొందరు వ్యాపారులు, దళారీలు ఇదే అదునుగా తమ అక్రమ వ్యాపారాలకు పదును పెడుతున్నారు. వ్యాపారులు ఉల్లిని సేకరించి గౌడన్లలో నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల టమోటా ధర పెరిగిన సందర్భంలో వినియోగదారులు దాదాపు టమోటా వాడకం తగ్గించారు. అలాగే ఇప్పుడు ఉల్లి వాడకం కూడా నానాటికీ తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే హోటల్స్, ఫాస్ట్ పుడ్ సెంటర్స్ లో ఉల్లి వాడకం తగ్గించారు. ఉల్లి ధర పెరగడంతో కొన్ని హోటల్స్ లో ఆనియన్ దోశతో పాటు ఆనియన్స్ తో తయారుచేసే అమ్మకాలు కూడా నిలిపేశారు. అలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయాలని కోరుతున్నారు వినియోగదారులు.

ఇవి కూడా చదవండి

భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ధర పెరగడానికి గల కారణాల పై విశ్లేషిస్తున్నారు. హోల్ సేల్ వ్యాపారులు ఉల్లిపాయలను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా గౌడన్ల పై మెరుపు దాడులకు దిగుతున్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర, కర్నూలు లో ఉల్లి పంట దిగుబడి తగ్గిందని, త్వరలో ఆయా చోట్ల కొత్త పంట దిగుబడి వస్తే కొంతమేర ఉల్లి ధర నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అధికారులు. ఏదేమైనా పెరిగిన ఉల్లి ధర భారం తమ పై పడకుండా చూడాలని కోరుతున్నారు వినియోగదారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..