Bobbili Fort: రాజాధి రాజ.. రాజ మార్తాండ.. ఈ కాలంలో కూడానా..? రాజవంశీయుల ఆధ్వర్యంలో..
విజయదశమి సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో జరిగిన ఆయుధ పూజను తిలకించేందుకు వేలాది మంది పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చారు. రాజాధిరాజా రాజమార్తాండ జయహో జయహో అంటూ సైనికులు రాజావారి కోటలో కవాతు చేశారు.వజ్ర వైడూర్యాలు పొదిగిన తలపాగా, రాజరిక దుస్తులు ధరించి సంప్రదాయబద్ధంగా కోట లోపల నుండి బయటకు వచ్చారు రాజావారు.
విజయదశమి సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో జరిగిన ఆయుధ పూజను తిలకించేందుకు వేలాది మంది పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చారు. రాజాధిరాజా రాజమార్తాండ జయహో జయహో అంటూ సైనికులు రాజావారి కోటలో కవాతు చేశారు.వజ్ర వైడూర్యాలు పొదిగిన తలపాగా, రాజరిక దుస్తులు ధరించి సంప్రదాయబద్ధంగా కోట లోపల నుండి బయటకు వచ్చారు రాజావారు. సింహాసనం పై ఆఖరి పట్టాభిషిక్తుడైన దివంగత ఆర్ ఎస్ ఆర్ కె రంగారావు వారి చిత్రపటం ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 1757లో జరిగిన చారిత్మాత్మక బొబ్బిలి యుద్ధం విజయనగరం మహారాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య జరిగిన భీభత్సకాండ.. యుద్ధంలో బొబ్బిలి రాజులు నేలకొరిగారు. ఆ తరువాత రోజుల్లో బొబ్బిలి వారసులు తిరిగి తమ రాజ్యాన్ని పునర్ నిర్మించుకున్నారు. నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలను దర్బార్ హల్ లో ఒక మ్యూజియంను ఏర్పాటు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచారు. అలా ఉంచిన ఆ ఆయుధాలను ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా బయటకు తీసి శుభ్రపరిచి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆయుధ పూజను బొబ్బిలి రాజవంశీయుల వారసులైన మాజీ మంత్రి రావు సుజయ్ కృష్ణ రంగారావు బహుదూర్, ఆయన సోదరుడు బేబినాయనలు సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ జరిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

