Kashmir Vistadome: కశ్మీర్ అందాలు ఇక కళ్లారా చూడొచ్చు. ప్ర‌కృతి అందాల‌ను తిల‌కిస్తూ రైలు ప్రయాణం..

Kashmir Vistadome: కశ్మీర్ అందాలు ఇక కళ్లారా చూడొచ్చు. ప్ర‌కృతి అందాల‌ను తిల‌కిస్తూ రైలు ప్రయాణం..

Anil kumar poka

|

Updated on: Oct 27, 2023 | 9:32 PM

భూతల స్వర్గం కశ్మీర్‌లో విస్టాడోమ్‌ రైలు సేవలు మొదలయ్యాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్ మనోజ్‌ సిన్హా తాజాగా బనిహాల్‌ నుంచి బుద్గామ్ వరకు సేవలను ప్రారంభించారు . కేవ‌లం ప్ర‌కృతి అందాల‌ను తిల‌కించే ప్ర‌దేశాల్లో మాత్ర‌మే ఈ కొత్త డిజైన్ విస్టాడోమ్ కోచ్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. విస్టాడోమ్ కోచ్‌ డిజైన్‌ ప్రత్యేకతలే వేరు. ఇందులో గ్లాస్ విండోలు ప్రత్యేక ఆకర్షణ.

భూతల స్వర్గం కశ్మీర్‌లో విస్టాడోమ్‌ రైలు సేవలు మొదలయ్యాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్ మనోజ్‌ సిన్హా తాజాగా బనిహాల్‌ నుంచి బుద్గామ్ వరకు సేవలను ప్రారంభించారు . కేవ‌లం ప్ర‌కృతి అందాల‌ను తిల‌కించే ప్ర‌దేశాల్లో మాత్ర‌మే ఈ కొత్త డిజైన్ విస్టాడోమ్ కోచ్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. విస్టాడోమ్ కోచ్‌ డిజైన్‌ ప్రత్యేకతలే వేరు. ఇందులో గ్లాస్ విండోలు ప్రత్యేక ఆకర్షణ. గ్లాస్ రూఫ్‌తో పాటు అబ్జ‌ర్వేష‌న్ లాంజ్‌, రూట్ టేబుల్ సీట్లను ఏర్పాటు చేసారు. ఒక్కొక్క విస్టాడోమ్ కోచ్‌లో 44 సీట్లు ఉంటాయి. ప్ర‌తి సీటు 180 డిగ్రీలు తిరిగే విధంగా ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు జర్నీలో బోరు కొట్టకుండా ఈ కోచ్‌లో వైఫై సేవలను కూడా ఏర్పాటు చేశారు. కశ్మీర్‌లో ఏడాది పొడవునా అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్యటకులు సందర్శించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక హిమపాతాన్ని ఆస్వాదించడానికి డిసెంబర్, జనవరి నెలలు అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన విస్టాడోమ్ కోచ్.. కశ్మీరి ప్రియులకు కనువిందు చేస్తుందడనంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..