Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: యూట్యూబ్ వీడియోలు చూసి హత్యకు ప్లాన్ చేశాడు.. సీసీ కెమెరాలు చూసిన పోలీసులు షాక్..

విజ్ఞానాన్ని పంచుతుంటే మరికొందరికి దొంగతనాలు ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలో తెలిపే వీడియోలు కొందరిని నేరస్ధులుగా అడుగులు వేసేందుకు దోహదపడుతున్నాయి. ఇదే కోవలో నెల్లూరు జిల్లా కావలిలో యూట్యూబ్ వీడియోలు చూసి వరప్రసాద్ అనే యువకుడు కావలి జనతాపేటలో మంచాల రమణమ్మ అనే వృద్ద మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పోలీసులు విస్తుపోయే సమాధనం వచ్చింది. హత్య చేసి పరారయిన..

Nellore: యూట్యూబ్ వీడియోలు చూసి హత్యకు ప్లాన్ చేశాడు.. సీసీ కెమెరాలు చూసిన పోలీసులు షాక్..
Youtube Videos
Follow us
Ch Murali

| Edited By: Sanjay Kasula

Updated on: Oct 27, 2023 | 10:01 PM

నెల్లూరు జిల్లా, అక్టోబర్27: యూట్యూబ్ వీడియో లు కొందరికి విజ్ఞానాన్ని పంచుతుంటే మరికొందరికి దొంగతనాలు ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలో తెలిపే వీడియోలు కొందరిని నేరస్ధులుగా అడుగులు వేసేందుకు దోహదపడుతున్నాయి. ఇదే కోవలో నెల్లూరు జిల్లా కావలిలో యూట్యూబ్ వీడియోలు చూసి వరప్రసాద్ అనే యువకుడు కావలి జనతాపేటలో మంచాల రమణమ్మ అనే వృద్ద మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పోలీసులు విస్తుపోయే సమాధనం వచ్చింది. హత్య చేసి పరారయిన దొంగ వర ప్రసాద్ ను విచారించగా యూట్యూబ్ వీడియోలు ద్వారా హత్యను ప్లాన్ చేసానని ఒప్పుకున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు అతని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

నెల్లూరు జిల్లా కావలి జనతాపేటలో మంచాల భారతి మాల్యాద్రి రిటైర్ ఎంప్లాయిస్ ,ఆమె అమ్మ రమణమ్మ కాపురం ఉంటున్నారు. వీరికి సహాయుకుడుగా వరప్రసాద్ అనే యువకుడును పెట్టుకున్నారు. అయితే రోజుట్లాగానే భారతి, మాల్యాద్రి వాంకింగ్ కు గ్రౌండ్ కు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లో సహాయుకుడుగా ఉంటున్న వరప్రసాద్ మదిలో డబ్బు మీద ఆశ కలిగింది.

యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఎలా నేరాలు చేయాలి, ఎలా హత్యలు చేయాలి అనే ఆలోచనతోనే ఆ వీడియోలను ఎంపిక చేసుకొని వాటిపై స్టడీ చేశారు. శరీరంలోని ఏభాగంలో ఎలా దాడి చేస్తే వ్యక్తి సృహ తప్పిపోతాడు.. ! హత్య అన్న అనుమానం రాకుండా ఎలా చేయాలి..! అన్న వీడియోలను యూట్యూబ్‌లో కొన్ని వీడియోలను చూశాడు.. అందులో ఉన్నట్లుగానే పథకం రచించాడు.

ఆ తరువాత అతను పనిచేస్తున్న ఇంట్లోనే స్కెచ్ వేశాడు. రోజు ఆలోచిస్తూ ఇంటి ఓనర్ లు వాకింగ్ కు వెళ్లగానే ఇంట్లోకి ప్రవేశించి బీరువా ఓపన్ చేసాడు. దానిలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన మంచాల రమణమ్మను యూట్యూబ్ వీడియోలలో చూసిన ప్రకారంగా రమణమ్మ అనే వృద్ద మహిళ (85) ను సుత్తితో కొట్టాడు రమణమ్మ సృహతప్పిపోగా ఇంట్లో నుంచి పరారయ్యాడు. వెంటనే అనుమానం లేకుండా ఇంటి ఓనర్స్ మాల్యాద్రి, భారతి ఇంటికి రాగానే వారికి టిఫిన్ తెచ్చిచారు.

వెంటనే వృద్ద మహిళ పడిపోయిందని గమనించిన కూతురు భారతి, అల్లుడు మాల్యాద్రి హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా హత్య చేసిన వరప్రసాద్ కూడా కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఆమెను కారులో హస్పటల్ వరకు వెంట ఉన్నాడు. అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం పోలీసులుకు సమాచారం అందటంతో అనుమానస్పద మృతి క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు సిసి కెమారాలు ఓపన్ చేసి ఇన్విస్టగేషన్ చేయగా ఆ సిసి కెమారాలలో నిందుతుడు వరప్రసాద్ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు . పోలీసులు వరప్రసాద్ ను విచారించగా ఈ నేరాలు, ఈ హత్యలు ఎలా చేయాలో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నట్లుగా పోలీసులకు చెప్పాడు. దీంతో అతని వద్ద నుంచి పోలీసులు లక్ష 64 వేలు విలువ చేసే ఐదు సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో యూట్యూబ్ వీడియోలను చెడు మార్గంలో ఉపయోగిస్తే కటకటాల పాలుకాక తప్పదని నిరూపించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం