Andhra Pradesh: గ్రహణ కాలంలో అక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. అదే ఆ టెంపుల్ స్పెషల్.. ఎక్కడంటే..

ఈ క్షేత్రంలో సకల దేవతలకు నిత్యం అభిషేకాలు, పూజలు, ఆరాధనలు 7 కాలాలుగా స్వామి అమ్మవార్లకు జరుగుతుండగా స్వామి వారి కవచంలో అగ్నిపట్టాకురితో పాటు 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు నిక్షిప్తం గా కవచంతో దర్శనం ఇవ్వడం వల్ల గ్రహణ సమయంలో శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. రాహు కేతువులు కూడా ఎలాంటి ప్రభావం చూపరని శాస్త్రం స్పష్టం చేస్తుంది. అందుకే ఈ క్షేత్రం గ్రహణ సమయాల్లోనూ నిత్య కైంకర్యాలతో దక్షణ కాశీ గా విరాజుల్లుతోంది.

Andhra Pradesh: గ్రహణ కాలంలో అక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. అదే ఆ టెంపుల్ స్పెషల్.. ఎక్కడంటే..
Srikalahasti Temple
Follow us
Raju M P R

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 27, 2023 | 10:04 PM

ఆంధ్రప్రదేశ్,అక్టోబర్27; దక్షిణకాశీగా రాహుకేతు క్షేత్రంగా విరాజుల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం లో గ్రహణ సమయం ఎంతో ముఖ్యమైంది. అందుకే గ్రహణ సమయంలో అన్ని హిందూ ఆలయాలు మూసివేస్తే శ్రీకాళహస్తిలో క్షేత్రంలో గ్రహణ సమయం లో ముక్కంటి దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఎలాంటి గ్రహణ ప్రభావం ఉండని రాహుకేతు క్షేత్రంలో ఆ సమయంలో మూడు కాలాల అభిషేకాలు నిర్వహించడం ప్రత్యేకత. ఈనెల 29న పాక్షిక చంద్రగ్రహణం తో తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటల పాటు టిటిడి మూసివేయనుంది. 28 రాత్రి 7.05 గంటల నుండి 29 ఉదయం 3.15 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనుంది. 29న వేకువ జామున 1.05 నుండి 2.22 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉండటంతో 28 సాయంత్రం 6 గంటల నుండి 29 ఉదయం 9 గంటల వరకు అన్న ప్రసాద కేంద్రం మూసివేయ నుండగా 28న శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.

చంద్రగ్రహణంతో టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు విజ్ఞాలకు అధిపతి అయిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం కూడా మూసివేయనున్నారు అయితే ఇందుకు భిన్నంగా గ్రహణ దోషం లేని శ్రీకాళహస్తి ఆలయంలో రేపు అర్ధరాత్రి ఒంటిగంటకు చంద్రగ్రహణ స్పర్శ కాలం, 1:45 గంటలకు మధ్యకాలం, 2:30 గంటలకు చంద్రగ్రహణం మోక్షకాలం లో ప్రత్యేక అభిషేకాలు అర్చకులు నిర్వహించనున్నారు. చంద్రగ్రహణ కాలంలో యధావిధిగా రాహుకేతు క్షేత్రం లో పూజలు, భక్తులకు దర్శనాలు అందుబాటులో ఉంటాయి. గ్రహణం విడిచాక సంప్రోక్షణతో శుద్ధిచేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక శాంతి అభిషేకం కూడా నిర్వహించనున్న అర్చకులు భక్తులకు శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసన్నాంబికల దర్శన భాగ్యం కల్పిస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడిపై 5 తలల సర్పం, అమ్మవారి నడుమున సర్పంతల బంగారు ఆభరణాల రూపంలో ప్రత్యేక అలంకరణగా ఉన్నందున ఆలయానికి గ్రహణ దోషం ఉండదని అర్చకులు చెబుతారు. నవగ్రహ కవచం కలిగిన మహా విష్ణువు వాయు లింగం అవతారంలో శ్రీకాళహస్తిలో కొలువై ఉన్నందున సూర్య చంద్ర గ్రహణాలు, రాహు కేతు దోషాలు స్వామివారికి ఉండవని ప్రాచుర్యంలో ఉంది.

దీంతో శ్రీకాళహస్తి క్షేత్రంలో కాలసర్ప దోషం, మహా కాలసర్పదోషాలకు పూజలు చేసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీకాళహస్తి క్షేత్రంలో సకల దేవతలకు నిత్యం అభిషేకాలు, పూజలు, ఆరాధనలు 7 కాలాలుగా స్వామి అమ్మవార్లకు జరుగుతుండగా స్వామి వారి కవచంలో అగ్నిపట్టాకురితో పాటు 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు నిక్షిప్తం గా కవచంతో దర్శనం ఇవ్వడం వల్ల గ్రహణ సమయంలో శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. రాహు కేతువులు కూడా ఎలాంటి ప్రభావం చూపరని శాస్త్రం స్పష్టం చేస్తుంది. అందుకే ఈ క్షేత్రం గ్రహణ సమయాల్లోనూ నిత్య కైంకర్యాలతో దక్షణ కాశీ గా విరాజుల్లుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ