Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఇది ఊరు కాదు.. దెయ్యాల దిబ్బ.. ఇక్కడ 15 ఆత్మలు స్వైర విహారం చేస్తున్నాయ్‌.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కిన ఈ గ్రామం..!

గ్రామంలో ఇలాంటివి సుమారు 15 మంది దెయ్యాలు తిరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడి అడవిలో చీకటి పడకముందే ఏడుపుల శబ్ధాలు వినిపిస్తున్నాయి. గ్రామం పేరు 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దేశంలోని అత్యంత హాంటెడ్ గ్రామంగా నమోదు చేయబడింది. ఇక్కడ అనేక రకాల దెయ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీని వల్ల ఇక్కడ నివసించడం సామాన్యులకు ఓ పీడకల వంటిదేనని చెప్పాలి. కానీ, ఇక్కడ కేవలం సుమారు 1000 మంది మాత్రమే నివసిస్తున్నారు.

వామ్మో ఇది ఊరు కాదు.. దెయ్యాల దిబ్బ.. ఇక్కడ 15 ఆత్మలు స్వైర విహారం చేస్తున్నాయ్‌.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కిన ఈ గ్రామం..!
Most Haunted Village
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2023 | 8:47 PM

మీరేప్పుడైనా దెయ్యాన్ని చూశారా..? అంటే చాలా మంది చూశామనే అంటుంటారు. ఎందుకంటే.. దెయ్యాలపై చాలా మంది చాలా రకాల అపోహలు పెట్టుకుంటారు.. పాత, పాడుబడిన బంగ్లాలు, బావుల్లో దెయ్యాలు తిరుగుతుంటాయని తరచూ అనేక కథనాలు వస్తుంటాయి. దెయ్యాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు గానీ, దెయ్యాలు ఉన్నాయని మాత్రం అనేక మంది నమ్ముతారు..సినిమాల్లో చూపించినట్లుగా ఆత్మలకు ఆకారం ఉండకపోవచ్చు. అలాగే వాటికి, మాయలు.. మంత్రాలు కూడా రాకపోవచ్చు. ఆత్మలు తిరుగుతున్నాయనేది కేవలం ఊహ మాత్రమే అయినప్పటికీ ప్రజలు దెయ్యాల ఉన్నాయని మాత్రం బలంగా నమ్ముతారు. అలాంటి దెయ్యాలకు నెలవైన ఒక గ్రామం కూడా ఉందంటే మీరు నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజమే..

బ్రిటన్‌లో భయంకరమైన గ్రామం ఒకటుంది. ఇక్కడ అనేక రకాల దెయ్యాలు స్వైర విహారం చేస్తుంటాయన్నది ఇక్కడి ప్రజల నమ్మకం. బ్రిటన్‌లోని కెంట్‌లో ఉన్న ప్లక్లీ గ్రామం పేరు 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దేశంలోని అత్యంత హాంటెడ్ గ్రామంగా నమోదు చేయబడింది. ఇక్కడ అనేక రకాల దెయ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీని వల్ల ఇక్కడ నివసించడం సామాన్యులకు ఓ పీడకల వంటిదేనని చెప్పాలి. కానీ, ఇక్కడ కేవలం సుమారు 1000 మంది మాత్రమే నివసిస్తున్నారు. నివేదిక ప్రకారం, అనేక దెయ్యాలు తిరుగుతున్నాయని చెబుతారు. అందులో ఒకటి హైవే హాంటింగ్ అని పిలుస్తారు.

18వ శతాబ్దంలో ఇక్కడ ఒక వ్యక్తి మరణించాడని చెబుతారు. అతని దెయ్యం ఆ ప్రాంతంలో తిరుగుతుందని చాలా మంది భయపడుతుంటారు. ఈ హైవేమాన్ తాడుతో ఇక్కడ ఒక చెట్టుకు ఉరివేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మరో భయానక ప్రదేశం డిక్కీ బస్ లేన్. ఇక్కడి అడవిలో కొన్నిసార్లు ఉపాధ్యాయుడి మృతదేహం కనిపిస్తుందని ప్రజలు చెబుతారు. అతను మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మరణించాడు.

ఇవి కూడా చదవండి

మరొక భయానక కథనంలో, ఒక మెకానిక్ గోడకు నలిగి చనిపోయాడు. అప్పుడప్పుడు అతని అరుపులు ప్లక్లీ చుట్టూ వినబడుతున్నాయి. మరొక కథ స్థానిక చర్చి సెయింట్ నికోలస్ గురించి. 1100ల సంవత్సరంలో ఇక్కడ ఒక స్త్రీ మరణించింది. ఆమెను రెడ్ లేడీ అని పిలుస్తారు. ఇప్పటికీ కూడా ఆమె ఆత్మ ప్రార్థనా మందిరం మైదానంలో తిరుగుతుందని కొందరు అంటున్నారు.

ఇది కాకుండా, చర్చిలోని వైట్ లేడీ 1952 సంవత్సరంలో అగ్నిప్రమాదంలో ధ్వంసమైన సురేండెన్ డేరింగ్‌లోని ఆమె పురాతన కుటుంబ ఇంటి లైబ్రరీకి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి అనేక ఇతర కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. గ్రామంలో ఇలాంటివి సుమారు 15 మంది దెయ్యాలు తిరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడి అడవిలో చీకటి పడకముందే ఏడుపుల శబ్ధాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..