Telangana: బంధువుల ఇంట విందు భోజనం.. బాలుడి ప్రాణం తీసిన మటన్ ముక్క..
Shadnagar: ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదాలను నివారించడానికి జగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైనా చికిత్స తీసుకోవడం అవసరం అంటున్నారు డాక్టర్లు. ఏదీ ఏమైనప్పటికీ విందు భోజనానికి వెళ్లి బాలుడు ప్రాణాలు కోల్పవడంతో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
RangaReddy District :మాంసం ముక్క ప్రాణం తీయడం ఏంటి అని అనుకుంటున్నారా… అవును మీరు చదివింది నిజమే… కొన్నిసార్లు ఇలాంటి చిన్న ఘటనలే పెద్ద విషదాన్ని నింపుతాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. షాద్నగర్ సమీపంలో ని బాలానగర్ మండలం మామిడి గుట్ట తండా కు చెందిన మున్నా బంధువుల ఇంట విందు భోజనానికి వెళ్లాడు. భోజనం చేస్తున్న సమయంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే షాద్నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఫంక్షన్ కావడంతో మటన్ ముక్కలను పెద్దగా కట్ చేయడంతోనే బాబు గోంతులో ముక్క ఇరుకున్నట్టు వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు వడ్డించే మటన్ ముక్కలు చిన్నగా ఉంటేనే తినడానికి ఈజీగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. మటన్ ముక్క గోంతులో చేరి గోంతులో అడ్డుకుంటే ఎముకపై ఉక్కిరి బిక్కిరి అవుతుందని…ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారి తీసి మరణానికి కుడా కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మంసం తినేటప్పుడు జగ్రత్త వహించడం తప్పనిసరి.
ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదాలను నివారించడానికి జగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైనా చికిత్స తీసుకోవడం అవసరం అంటున్నారు డాక్టర్లు. ఏదీ ఏమైనప్పటికీ విందు భోజనానికి వెళ్లి బాలుడు ప్రాణాలు కోల్పవడంతో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..