Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: లిప్‌స్టిక్ లేకుండా అంద‌మైన గులాబీ పెద‌వుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన, ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదంటే ఆశ్చర్యపోతారు.. మీ రోజువారీ జీవితంలో కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ చక్కటి పెదాలను గులాబీ రంగులోకి మార్చవచ్చు . అందుకోసం ప్రతి రాత్రి పడుకునే ముందు మీ పెదవులకు కలబంద జెల్ లేదా కొబ్బరి నూనె వంటి సహజమైన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల పెదవుల పగుళ్లను నివారించవచ్చు. అలాగే పెదాలను నేచురల్‌గా పింక్‌గా మార్చడంలో సహాయపడుతుంది.

Beauty Tips: లిప్‌స్టిక్ లేకుండా అంద‌మైన గులాబీ పెద‌వుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Lips Pink And Healthy
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2023 | 3:33 PM

అందమైన పెదవులను చాలా మంది కవులు తియ్యటి పండుతో పోలుస్తారు. ఆపిల్‌ పండు లాంటి అందమైన పెదవులు ఉండాలనేది అందరికీ ఉండే కోరిక..పెదవులు ఎప్పుడూ గులాబీ పువ్వులా ఉండాలనేది ఆడవాళ్లందరి కోరిక. ఐతే ఒక్క వారంలో మీ నిర్జీవంగా ఉన్న మీ పెదవులు.. పింక్ కలర్‌లోకి మారలంటే ఇలాంటి సూపర్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది..ఎలాంటి కెమికల్స్‌, లిప్‌స్టిక్‌ లేకుండా మీ పెదాల రంగు మీకు నచ్చేలా మారుతుంది.. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన, ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదంటే ఆశ్చర్యపోతారు.. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

పెదవుల రంగు మారడానికి కారణాలు:

వాసెలిన్ వంటి లిప్ బామ్ వాడిన తర్వాత కూడా మన పెదాలు ఎందుకు రంగు మారుతున్నాయి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. సూర్యరశ్మికి గురికావడం, ధూమపానం, హార్మోన్లలో మార్పులు, ఇనుము లోపం వంటి అనేక కారణాల వల్ల మీ పెదాల రంగు మారుతుంది. కానీ, మీ రోజువారీ జీవితంలో కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ చక్కటి పెదాలను గులాబీ రంగులోకి మార్చవచ్చు .

ఇవి కూడా చదవండి

ఇంట్లోనే ఉంటూ పాటించాల్సిన కొన్ని చిట్కాలు…

పుష్కలంగా నీళ్లు తాగండి :

మన శరీరంలాగే చర్మం కూడా డీహైడ్రేట్ అవుతుంది. వీటి నివారణకు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఇది పెదాలు, చర్మం మెరుపును పెంచుతుంది

ఇంట్లో లభించే టమాటా, పెరుగుతో..

మన వంటింట్లో లభించే టమాటా, పెరుగును ఉపయోగించి కూడా పెదవుల అందాన్ని పెంచుకోవచ్చు.. ఇందుకోసం టమాటా, పెరుగును ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై స్మూత్‌గా రాయాలి. సుమారు 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల పెదవులు అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

బీట్ రూట్ స్క్రబ్:

బీట్ రూట్ శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. అలాగే పెదాలు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. బీట్ రూట్ ముక్కలతో వారానికి 3-4 సార్లు ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. బీట్‌రూట్ జ్యూస్‌ కూడా తీసుకోవడం వల్ల మరింత సానుకూల ఫలితాలు వస్తాయి.

సహజ మాయిశ్చరైజర్:

ప్రతి రాత్రి పడుకునే ముందు మీ పెదవులకు కలబంద జెల్ లేదా కొబ్బరి నూనె వంటి సహజమైన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల పెదవుల పగుళ్లను నివారించవచ్చు. అలాగే పెదాలను నేచురల్‌గా పింక్‌గా మార్చడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…